బిజినెస్

వడివడిగా విమానయాన విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: ప్రాంతీయ విమాన అనుసంధాన పథకాన్ని (ఆర్‌సిఎస్) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించింది. కొత్త పౌరవిమానయాన విధానంలో భాగంగా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు అందాలనే ప్రభుత్వ యోచనకు అనుగుణంగా ఆర్‌సిఎస్‌ను తీసుకొచ్చారు. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతోసహా భాగస్వాములందరి అభిప్రాయాలను దీనిపై కేంద్రం సేకరిస్తోంది. మూడు వారాల్లోగా తమ అభిప్రాయాలను పంపాల్సిందిగా కేంద్రం కోరుతుండగా, దీనిపై ఆగస్టులో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 90 విమానాశ్రయాలను లక్ష్యంగా మోదీ సర్కారు నిర్దేశించుంది. ఇకపోతే ఈ ప్రతిపాదిత పథకంలో భాగంగా ఓ కొత్త కేటగిరీ ఎయిర్‌లైన్స్ ఏర్పడనుంది. కేవలం ఒక్క విమానంతో కూడా విమాన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ఈ పథకం క్రింద ప్రాంతీయ అనుసంధాన నిధి (ఆర్‌సిఎఫ్) ద్వారా ప్రభుత్వం వియబిలిటి గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్)ను కూడా అందిస్తుంది. అయితే విజిఎఫ్‌లో 80 శాతం బాధ్యత కేంద్రానిదైతే, మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వాలది. ఏటా 500 కోట్ల రూపాయల మూలనిధి కోసమే ఇదంతా. ఆర్‌సిఎస్ కోసమే ఈ ఆర్‌సిఎఫ్‌ను ఏర్పాటు చేసినట్లు నూతన పౌరవిమానయాన విధానం ఆవిష్కరణ సందర్భంగా గతంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు కూడా. కొన్ని విమానాలపై లెవీ ద్వారా దీన్ని అమలు పరుస్తామని చెప్పారు. ఇందులోభాగంగానే తాజాగా కొన్ని మార్గాల్లో ప్రయాణించే విమానాల నుంచి ప్రభుత్వం లెవీని వసూలు చేయనుంది. అయితే ఈ నిర్ణయం విమాన చార్జీల్లో స్వల్ప పెరుగుదలకు దారితీయనుంది. కాగా, ఈ లెవీ ఎంత ఉంటుందన్నదానిపై అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే స్పందిస్తూ ఇంకా దానిపై తుది నిర్ణయానికి రాలేదని, త్వరలోనే స్పష్టం చేస్తామన్నారు. ఇకపోతే గంట సమయం తీసుకునే దాదాపు 500 కిలోమీటర్ల దూరానికి లేదా 30 నిమిషాల హెలికాప్టర్ ప్రయాణానికి 2,500 రూపాయలుగా నిర్ణయించినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఇప్పటికే చెప్పినది తెలిసిందే. 200ల నుంచి 800ల కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం విమానయాన సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు తమ నూతన పౌరవిమానయాన విధానం కలిసొస్తుందని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పుడు కేవలం 31 విమానాశ్రయాలే అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. వీటిని 90కి తీసుకెళ్తామని, తద్వారా చిన్న పట్టణాలకూ విమాన సౌకర్యం కల్పిస్తామని, అదే మా లక్ష్యమని రాజు చెప్పారు. ఇక దేశంలో 394 విమానాశ్రయాలున్నప్పటికీ 16 విమానాశ్రయాల్లోనే రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు.

అదాని చేతికి జిఎమ్‌ఆర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ, జూలై 1: తమ రెండు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల్లో వాటాను అదాని ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ఎటిఎల్)కు అమ్మేస్తున్నట్లు జిఎమ్‌ఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జిఇఎల్) శుక్రవారం ప్రకటించింది. మారు ట్రాన్స్‌మిషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎమ్‌టిఎస్‌ఎల్), ఆరావళి ట్రాన్స్‌మిషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎటిఎస్‌ఎల్) వాటాలను అదానికి జిఎమ్‌ఆర్ అమ్ముతోంది. ప్రస్తుతం ఎమ్‌టిఎస్‌ఎల్‌లో 74 శాతం వాటా, ఎటిఎస్‌ఎల్‌లో 49 శాతం వాటాను జిఎమ్‌ఆర్ కలిగి ఉంది. కాగా, ఈ వాటాలను 100 కోట్ల రూపాయలకు జిఎమ్‌ఆర్ నుంచి అదాని ట్రాన్స్‌మిషన్ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు జిఎమ్‌ఆర్ ఎనర్జీ లిమిటెడ్‌కు, అదాని ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జిఎమ్‌ఆర్ తెలియజేసింది. జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జిఐఎల్) అనుబంధ సంస్థే ఈ జిఎమ్‌ఆర్ ఎనర్జీ లిమిటెడ్. విక్రయిస్తున్న ఈ రెండు ప్రాజెక్టులకు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న రుణ భారం 324 కోట్ల రూపాయలు.