బిజినెస్

గ్రామీణ ప్రాంతాలపై పారిశ్రామికవేత్తలు దృష్టిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సూచించారు. సోమవారం ఇక్కడ ఐటిసి కాకతీయలో జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ట్యాప్సి) శత వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. సంవత్సర కాలం పాటు జరగనున్న ఫ్యాప్సి వేడుకలను గవర్నర్ నరసింహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఎఫ్‌టాప్సి పారిశ్రామిక రంగంలో తనదైన శైలిలో పురోభివృద్ధిని సాధించి మరో వందేళ్లు కూడా విజయవంతంగా పూర్తిచేసుకోవాలని ఆశిర్వదిస్తున్నానన్నారు. పారిశ్రామికవేత్తలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాలపై సైతం దృష్టిపెట్టాలన్నారు. గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని గుర్తుచేశా రు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో మానవ వనరులు, సహజ వనరులు, వౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తద్వారా వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి వారికి ఉపాధిని కల్పించాలని అభిలషించారు. ఇందుకు ఎఫ్‌టాప్సి తోడ్పాటును అందించాలన్నారు. ప్రసు తత విద్యావ్యవస్థలో సైతం మార్పులు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన యువత ఖాళీగా ఉండటం ఆవేదన కలిగించే అంశమన్నారు. పాలకులు సైతం ఉచిత ప్రలోబాలకు గురిచేయకుండా స్వయం శక్తి, స్వాలంభనతో ఆర్ధికంగా ఎదిగేలా బాటలు వేయాలన్నారు. ఐటి, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయని, ఎరోస్పేస్, ఆటోమొబైల్స్, ఐటి, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయన్నారు.

ఎఫ్‌ట్యాప్సి వందేళ్ల వేడుకల్లో మాట్లాడుతున్న నరసింహన్