బిజినెస్

నేడు టోక్యోకు మంత్రి నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్‌ఓడి కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి జపాన్‌లోని మాకీ కంపెనీతో తుది దశ చర్చలు జరిపేందుకు మంత్రి నారాయణ గురువారం టోక్యోకు బయల్దేరి వెళ్తున్నారు. నారాయణతోపాటు ఐఎఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథి కూడా వెళ్తున్నారు. మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లకు దేశీయ ఆర్కిటెక్ట్‌లతో సవరణలు చేయించారు. గత నెలాఖరుకు ఈ డిజైన్లు ఫైనలైజ్ కావల్సి ఉంది. దీంతో మాకీ సంస్థతో చర్చించి, డిజైన్లను ఫైనలైజ్ చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ వారం, పది రోజుల్లో డిజైన్లపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం ఆఖరుకు రాజధానిలోని కీలక భవన నిర్మాణాలు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
స్విస్ చాలెంజ్‌లో అవకతవకలు జరగలేదు!
ఇదిలాఉండగా స్విస్ చాలెంజ్‌లో ఎటువంటి అవకతవకలు జరగలేదని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలకన్నా మెరుగైన ప్రతిపాదనలు ఏ దేశానికి చెందిన కంపెనీలైనా, స్వదేశీ కంపెనీలు ఇచ్చినా, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని నారాయణ తెలిపారు. స్విస్ చాలెంజ్‌లో మెరుగైన ప్రతిపాదనలను ఆమోదించిన తరువాత 1691 ఎకరాల భూమిని వారికి ఇస్తామని అన్నారు. ఇందులో తొలి 50 ఎకరాలను నామమాత్రపు ధరకు ఇస్తామని, ఆ తరువాత ఎకరా నాలుగు కోట్ల రూపాయల కనీస ధర నుంచి, ఆపై ఎంత ఎక్కువ ధర వస్తే, అంత ధరకు భూమిని కేటాయిస్తామని నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ప్రపంచ ప్రఖ్యాత రాజధాని అవసరమని, ఇందుకు స్విస్ చాలెంజ్ విధానం సహకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్విస్ చాలెంజ్‌పై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.