బిజినెస్

‘ఎఎంఎఫ్ విధానంతో సినీరంగానికి మేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు సాంకేతిక విప్లవం వచ్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తోంది. ఒకప్పుడు రీళ్లు రీళ్లుగా వచ్చే సినిమా ప్రింట్.. ఇప్పుడు చిన్న సైజ్ సీడీలో వచ్చేస్తోంది. శాటిలైట్ నుండి డైరెక్టుగా థియేటర్‌లోకి సినిమా అడుగుపెట్టింది కూడా. ఇలా రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న సినీ పరిశ్రమకు మరో కొత్త విధానం పరిచయం అవుతోంది. ఎస్‌పిడిటి సంస్థ అందిస్తున్న ఆ కొత్త విధానం డిజిటల్ ప్రింట్ టెక్నాలజీకి దీటైన ఎఎంఎఫ్ విధానం. ఇది పరిశ్రమకు లాభదాయకంగా ఉంటుందని పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
సికింద్రాబాద్ మంజు థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎఎంఎఫ్ అధినేత, నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు, కొన్ని సంస్థలు డిజిటల్ ప్రింట్ డెలివరీని మొదటివారానికి 12 వేల రూపాయలకు, రెండవ వారానికి 8 వేల రూపాయలను వసూలు చేస్తున్నాయని, తాము మాత్రం కేవలం 3 వేలు, 1,200 రూపాయలకే అందించనున్నామని తెలిపారు. దాదాపు వంద థియేటర్లలో సినిమాను విడుదల చేయాలంటే వేరే సంస్థలతో 12 లక్షలు ఖర్చయితే, తమ సంస్థతో కేవలం 3 లక్షల వ్యయమే అవుతుందని తెలిపారు. సినీ రంగంలోవారికి ఓ మంచి అవకాశంగా, మినీ థియేటర్ల ఇంటీరియర్‌లో భాగంగా సౌండ్ ప్రొజెక్టర్, సీటింగ్, ఏసి వంటి అన్ని రకాల సౌకర్యాలకోసం తమ సంస్థ ఆర్థిక సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తోందని, ఈ విధానానికి పరిశ్రమలో ఉన్నవారు చేయూత అందివ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.