బిజినెస్

కొత్త కస్టమర్లకు మొబైల్ కాల్ ధరల్లో 80 శాతం తగ్గింపు: బిఎస్‌ఎన్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోలేక వెనుకబడిన ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. వినియోగదారులను పెంచుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇందులోభాగంగానే కొత్తగా బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకి తొలి రెండు నెలలపాటు కాల్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఆదివారం పిటిఐకి తెలిపారు. కాల్ చార్జీల పరంగా నిమిషం, సెకను ప్లాన్లు రెండింటికీ తగ్గించిన ధరలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. సెకన్ ప్లాన్‌కైతే 36 రూపాయలు, నిమిషం ప్లాన్‌కైతే 37 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్ల సంఖ్య 79.6 మిలియన్లుగా ఉంది. కస్టమర్లపరంగా దేశీయ టెలికాం సంస్థల్లో ఐదో స్థానంలో నిలిచింది.