బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం తొలి నాలుగు రోజులు (సోమ-గురు) లాభాలను అందుకున్న స్టాక్ మార్కెట్లు.. వరుస రెండు వారాల నష్టాలకు అడ్డుకట్ట వేశాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)కుగాను జిడిపి వృద్ధిరేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం 8.1-8.5 శాతం నుంచి 7-7.5 శాతానికి దించడంతో శుక్రవారం నష్టాలు తప్పలేదు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుతున్నప్పటికీ ఇంతదాకా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందకపోవడం మదుపరుల పెట్టుబడుల ఆసక్తిని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ఈ వారం సూచీలు పడుతూ లేస్తూ పయనం సాగించవచ్చని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నిలకడలేని ముడి చమురు ధరలు కూడా ఈ వారం భారతీయ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేస్తాయంటున్నారు. ‘ఈ వారం మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందనిపిస్తోంది. దేశీయ పరిస్థితులు ముఖ్యంగా జిఎస్‌టి ఆమోదంపై ఏర్పడిన ప్రతిష్టంభన కారణం.’ అని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ ఫండమెంటల్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు.
రాజ్యసభలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తగినంత మెజారిటీ లేకపోవడంతో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందలేకపోతున్నది తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి బిల్లును అమల్లోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా మోదీ కలిశారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక శాతం అదనపు పన్నును తొలగించేందుకు సిద్ధమన్నారు. జిఎస్‌టి రేటు 18 శాతం దిగువనే ఉంటుందనీ చెప్పారు. అయినప్పటికీ పార్లమెంట్‌లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం లేకపోయింది. బుధవారంతో ఈ పార్లమెంట్ సమావేశాలు ముగుస్తుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులకు లోను కావచ్చని చెబుతున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోతుండటం చమురు షేర్లకు నష్టం.’ అని క్యాపిటల్ వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ రిసెర్చ్ డైరెక్టర్ వివేక్ గుప్తా అన్నారు. కాగా, శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరగనుంది.