బిజినెస్

కుబేరుల భారతావని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో మిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోంది. 2015 డిసెంబర్ నాటికి భారత్‌లో 2,36,000 అపర కుబేరులు (హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ) ఉన్నారని, వీరి సంపద విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉందని న్యూ వరల్డ్ వెల్త్ రూపొందించిన ‘ఇండియా 2016 వెల్త్ రిపోర్టు’ ద్వారా తెలుస్తోంది. నిజానికి 2007 నుంచి ప్రపంచంలోని చాలా దేశాల్లో మిలియనీర్ల సంఖ్య పడిపోతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం వృద్ధి కనిపించిందన్న సదరు నివేదిక.. 2025 నాటికి దేశంలో మిలియనీర్ల సంఖ్య 5,54,000 మందికి చేరవచ్చని అంచనా వేసింది.
‘మా సమీక్ష ప్రకారం భారత్‌లో అపర కుబేరులు 2007లో 1,52,000గా ఉన్నారు. 2015లో 2,36,000లకు పెరిగారు. ఈ ఎనిమిదేళ్లలో 55 శాతం వృద్ధి కనిపించింది. 2007లో 0.9 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న వీరి సంపద కూడా 2015లో 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. వృద్ధిరేటు 67 శాతం నమోదైంది.’ అని ఆ నివేదికలో న్యూ వరల్డ్ వెల్త్ పేర్కొంది. ఒక మిలియన్ డాలర్లు (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ప్రకారం 6.7 కోట్లు), అంతకంటే ఎక్కువ సంపద కలిగినవారిని హెచ్‌ఎన్‌డబ్ల్యుఐగా పరిగణిస్తారు. కాగా, లోకల్ కన్‌స్ట్రక్షన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో నమోదైన బలమైన వృద్ధిరేటే దేశంలో మిలియనీర్ల సంఖ్య పెరగడానికి వెనుకున్న అసలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే రాబోయే పదేళ్లలో భారత మిలియనీర్ల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంటున్నారు. ‘2025 నాటికి భారత్‌లో మిలియనీర్లు 5,54,000 మంది ఉంటారని అంచనా. ప్రస్తుతంతో పోల్చితే ఇది 135 శాతం అధికం.’ అని నివేదిక అభిప్రాయపడింది. ఇకపోతే వియత్నాం, శ్రీలంక, చైనా, మారిషస్‌తోపాటు భారత్‌లోనూ మిలియనీర్లు వేగంగా పెరిగిపోతున్నారని నివేదిక తెలిపింది.
అయితే భారత్‌లో వ్యాపార నిర్వహణకు కొన్ని అడ్డంకులున్నాయని, ముఖ్యంగా అవినీతి అని చెప్పింది. పనుల కోసం తరచూ ప్రభుత్వ అధికారులకు లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోందనడం గమనార్హం. అయినప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనతో గత ఏడాది కాలంలో ఈ పరిస్థితి కొంత మెరుగైందంది. అయితే కొన్ని విభాగాల్లో పారదర్శకత లోపించిందని, దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అధిక ఖర్చుతో కూడుకుందన్న న్యూ వరల్డ్ వెల్త్.. ఓ కాంట్రాక్టును దక్కించుకోవాలంటే సగటున 1,420 రోజుల సమయం పడుతోందని, ఈ విషయంలో భారత్ పనితీరు చాలా పేలవంగా ఉందంది.