బిజినెస్

కార్మికుల బోనస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కర్మాగార కార్మికుల బోనస్ లెక్కింపునకు సంబంధించిన వేతన పరిమితిని రెట్టింపు చేసి నెలకు రూ.7 వేలకు పెంచేందుకు అనుమతించే బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను కలిగివున్న సంస్థలకు వర్తించే ఈ బిల్లు 2014 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుంది. బోనస్ చెల్లింపునకు సంబంధించిన నెలవారీ వేతన అర్హత పరిమితిని రూ.10 నుంచి రూ.21 వేలకు పెంచడం పట్ల కొంత మంది సభ్యులు బల్లలు చరిచి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో లోక్‌సభ మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుపై సభలో జరిగిన చర్చకు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిస్తూ, కార్మికుల ప్రయోజనాలను, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఎన్‌పిఎస్ పరిధిలోని
ఉద్యోగులకు గ్రాట్యుటీ
కేంద్ర ప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పిఎస్) కిందికి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పార్లమెంటుకు తెలియజేసారు. చట్ట సవరణ ప్రకారం 2003 డిసెంబర్ 31 తర్వాత నియమితులైన ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు వర్తించవని సిన్హా రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేసారు. 2004 జనవరి 1నుంచి ఎన్‌పిఎస్‌ను ప్రవేశపెట్టడంతో గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలు మారిపోయాయని ఆయన చెప్పారు. అయితే, 2009 మే 5నుంచి తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి కూడా మరణానంతర ప్రయోజనాలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీని వర్తింపజేయడం జరిగిందని ఆయన చెప్పారు.