బిజినెస్

సంస్కరణలపై ఏకాభిప్రాయం మృగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆర్ధిక సంస్కరణల అమలుపై పార్లమెంటులో రాజకీయంగా ఏకాభిప్రాయం లోపించినా, జాప్యమైనా దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై ఉంటుందని అసోచామ్ అధ్యక్షులు సునీల్ కనోరియా అన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఆర్ధిక సంస్కరణలు మందకొడిగా అమలవుతున్నాయనే సందేశం ఇస్తే ఇనె్వస్టర్లలో ఆత్మవిశ్వాసం సడలుతుందన్నారు. ఇది ముమ్మాటికి ఆందోళనకరమైన విషయమన్నారు. కేంద్రం జిడిపి ఎనిమిది శాతం దాటుతుందని అంచనా వేసిందని, ఈ లక్ష్యసాధనకు చాలా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం సాధారణ స్థితికి వస్తుందని అంచనా వేశామన్నారు. జిఎస్‌టి బిల్లు పాసవుతుందని భావించామన్నారు. కాని ఇప్పుడు అందుకు అనుకూలమైన పరిస్ధితులు లేవన్నారు. మార్కెట్లు బలోపేతం అయ్యేందుకు ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలను ఆయన స్వాగతించారు. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు జిఎస్‌టి బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు.

రూ.6,192 కోట్ల ఎఫ్‌డిఐల కోసం
పది బీమా సంస్థల దరఖాస్తు

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) పొందేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దేశంలో పది బీమా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీమా సంస్థల్లో ఇంతకుముందు 26 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 23వ తేదీన 49 శాతానికి పెంచిన విషయం విదితమే. దీంతో సుమారు 6,192 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఐఆర్‌డిఎఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ), ఎఫ్‌ఐపిబి (విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు)కు పది బీమా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.