బిజినెస్

ద్రవ్యోల్బణం ఎలా తగ్గించాలో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 17: ద్రవ్యోల్బణాన్ని ఎలా కట్టడి చేయాలో తనకు చెప్పాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శకులకు సవాల్ విసిరారు. దేశ వృద్ధిరేటు కంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపైనే రాజన్ దృష్టి పెట్టారంటూ తనపై వచ్చిన విమర్శలకు ఆయన పైవిధంగా స్పందించారు. తనను విమర్శించడానికి ముందు ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపులో పెట్టవచ్చో చెప్పండని ఆయన ప్రశ్నించారు. వడ్డీరేట్లను ఎప్పుడూ ఎక్కువగానే ఉంచారని రాజన్‌పై విమర్శలు రాగా, ధరల అదుపునకు అదే సరైన మార్గమని రాజన్ చెప్పుకొచ్చారు. అనవసరంగా వడ్డీరేట్లను ఎప్పుడూ పెంచలేదని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నానన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే రాజన్.. ఆర్‌బిఐ గవర్నర్లలో సంచలనంగా నిలిచినది తెలిసిందే. ఈ సెప్టెంబర్‌తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. కాగా, ఇక్కడ కొందరు విలేఖరులతో రాజన్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, అది ఖర్చుతో కూడుకున్నదన్నారు. అయితే అందరికీ బ్యాంకింగ్ సేవలను అందించడంలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నామని, మొబైల్ బ్రాంచీలు, చిన్న లేదా సూక్ష్మ బ్రాంచీలను ఏర్పాటుచేసే దానిపై పరిశీలిస్తున్నామన్నారు. ఇదిలావుంటే విచారణల్లో సిబిఐ, సివిసి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండటంపై రాజన్ స్పందిస్తూ బ్యాంకింగ్ రంగంలోని అక్రమాలపై దర్యాప్తు జరిగినప్పుడు అందరూ సహకరించాల్సిందేనని, తప్పించుకోలేరని, దీనిలో ఉన్న ఇబ్బందేమిటో? అని ప్రశ్నించారు.
పుస్తకం రాసే ఆలోచన లేదు
రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా తన అనుభవాలపై ఓ సమగ్ర పుస్తకాన్ని రాసే ఆలోచనేదీ ఇప్పుడు తనకు లేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రాజన్ కంటే ముందున్న గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇటీవల తన పుస్తకంలో అప్పటి ఆర్థిక మంత్రుల తీరును వెల్లడించిన నేపథ్యంలో పైవిధంగా రాజన్ బదులిచ్చారు. రాజన్ ముక్కుసూటి తనంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకున్న విబేధాలు తరచూ బయటపడుతున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి తనకు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండాలని ఉందంటూ రాజన్ చెప్పినా.. కుదరలేదు.
హైదరాబాద్‌కు రాజన్
హైదరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ వద్ద సోమవారం జరిగే సెమినార్‌లో రాజన్ పాల్గొంటున్నారు. ‘ఇక్విటీ, యాక్సెస్ అండ్ ఇంక్లూజన్-ట్రాన్స్‌ఫార్మింగ్ రూరల్ ఇండియా థ్రూ ఫైనాన్షియల్ ఇంక్లూజన్’పై జరిగే ఈ జాతీయ సెమినార్‌లో ఆయన ప్రసంగిస్తారని ఆదివారం ఇనిస్టిట్యూట్ వర్గాలు తెలిపాయి. ఐఆర్‌డిఎఐ చైర్మన్ టిఎస్ విజయన్, ఆంధ్రా బ్యాంక్ ఎండి సురేశ్ ఎన్ పటేల్, నాబార్డు డిప్యూటి ఎండి, ముద్రా సిఇఒలూ సెమినార్‌లో పాల్గొననున్నారు.