బిజినెస్

త్రైమాసిక ఫలితాలే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా తదితర అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలు ఈ వారం తమ ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. దీంతో మదుపరులు వీటి ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు విశే్లషిస్తున్నారు. అలాగే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతుండగా, కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదంపై మదుపరుల చూపు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వర్ష అంచనాలూ ముఖ్యమేనంటున్నారు. ‘పార్లమెంట్‌లో జిఎస్‌టి బిల్లుపైనే ఈ వారం అందరి చూపు నెలకొంది. అలాగే తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, వర్ష అంచనాలను మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారు. అయితే సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలే మార్కెట్ కదలికలను అధికంగా ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందాల్సి ఉండటమే.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. కాగా, గత వారం వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై మార్కెట్లు ముందుగా స్పందించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత రిలియన్స్ ఫలితాలు విడుదలవగా, సంస్థ ఏకీకృత నికర లాభం 7,113 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 6,024 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇకపోతే ఎప్పటిలాగే విదేశీ మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు భారత మార్కెట్లను శాసించవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ వ్యవస్థాపకుడు, సిఇఒ రోహిత్ గదియా అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధన లను సరళతరం చేయడం, నూతన ఖనిజ అనే్వషణ విధానాన్ని ఆమోదించడం, షాపింగ్ సముదాయాలు, సినిమా హాల్స్‌ను 24 గంటలు తెరిచేందుకు అంగీకరిం చడం వంటి ఇటీవలి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు విదేశీ మదుపరులను ఆకట్టుకున్నాయ. దీంతో గడచిన 15 రోజుల్లో 9,768 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు దేశ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చాయ. కాబట్టి విదేశీ మదుపరులు ఈ వారం కూడా పెట్టుబడుల జోష్‌లోనే కొనసాగితే స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 709.60 పాయింట్లు పుంజుకుని 27,836.50 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 218 పాయింట్లు ఎగిసి 8,541.40 వద్ద నిలిచింది. టర్నోవర్ విషయానికొస్తే గత వారం బిఎస్‌ఇ 17,549.28 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 99,880.60 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 12,185.36 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 70,128.01 కోట్ల రూపాయలుగా నమోదైంది.

ఎపిఎఫ్‌సిసిఐకి
నూతన కార్యవర్గం ఎన్నిక

నెల్లూరు, జూలై 17: ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎపిఎఫ్‌సిసిఐ)కి నూతన కార్యవర్గం ఎన్నికైంది. సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం నెల్లూరు నగరంలోని ఎస్‌బిఎస్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి సభ్యు లు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఎన్నికైన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కర్‌రావు చేత సోమిరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా నెల్లూరు నగరానికి చెందిన సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కొప్పు సత్యనారాయణ (పాలకొల్లు), విజయకుమార్‌రెడ్డి (కర్నూలు), వెలంపల్లి రామంచంద్రరావు (విజయవాడ), ముఖ్యకార్యదర్శిగా విజయవాడకు చెందిన పిఎస్‌ఎల్‌ఎల్ వరప్రసాద్‌ను ఎన్నుకున్నారు. ఈ ప్రమాణస్వీకారత్సోవానికి మొత్తం 13 జిల్లాల నుంచి వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో 500 ఎకరాలలో సింగపూర్ టెక్నాలజీతో ట్రేడ్ సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతో వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుందన్నారు.

కెన్యాలో అశోక్ లేలాండ్ బస్ తయారీ ప్లాంట్

న్యూఢిల్లీ, జూలై 17: హిందుజా గ్రూప్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థ అశోక్ లేలాండ్.. కెన్యాలో ఓ బస్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. 70 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నెలకొల్పనుండగా, విదేశీ కార్యకలాపాల విస్తరణలో భాగంగానే ఈ ప్లాంట్ అని అశోక్ లేలాండ్ సీనియర్ ఉపాధ్యక్షుడు (గ్లోబల్ బిజినెస్) టి వెంకట్రామన్ ఆదివారం ఇక్కడ పిటిఐకి తెలిపారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 1,200 బస్సులని చెప్పారు. కాగా, ఇక్కడ తయారైన బస్సులను కెన్యా పొరుగున గల మూడు దేశాలకు ఎగుమతి చేస్తామని కూడా ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం (జూలై- సెప్టెంబర్)లో ప్లాంట్ పనులు మొదలవుతాయన్నారు.