బిజినెస్

అమ్మకాల వత్తిడితో మార్కెట్లకు మళ్లీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి నష్టాలు చవి చూసాయి. విదేశీ మార్కెట్లలో మిశ్రమ ధోరణుల నేపథ్యంలో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో బిఎస్‌ఇ ప్రధాన సూచీ సెనె్సక్స్ 145 పాయింట్లు నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు చేరుకోగా, జాతీయ స్టాక్‌ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఐటి, లోహాలు, ఎఫ్‌ఎంసిజి, ఆటోతయారీ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూసాయి. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడం, వచ్చే గురువారం ( 31న) నెలవారీ డెరివేటివ్స్ గడువు ముగియనుండడంతో మదుపరులు తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను వదిలించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ ప్రారంభంనుంచే ఒడిదుడుకులతో సాగుతూ చివరికి 145.25 పాయింట్ల నష్టంతో 25,590.65 పాయింట్ల వద్ద ముగిసింది. దెషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 48.35 పాయింట్లు నష్టపోయి 7786.10 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా కాంగ్రెస్ తాజాగా మరోసారి హెచ్-1బి, ఎల్-1 వీసాలపై ప్రత్యేక ఔట్‌సోర్సింగ్ ఫీజును విధించడంతో ఐటి రంగానికి చెందిన షేర్లు బాగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో షేర్లు 1.67 శాతం పడిపోయాయి. ఐటిసి, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, లుపిన్, ఎస్‌బిఐ, హీరో మోటోకార్ప్, ఎల్‌అండ్‌టి, టాటా మోటార్స్, బిహెచ్‌ఇఎల్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి షేర్లు కూడా నష్టాలు చవి చూసాయి. అయితే సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్,్భరతీ ఎయిర్‌టెల్, హింద్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, గెయిల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియడం కొంత ఊరటనిచ్చింది. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 20 నష్టాల్లో ముగియగా, పది మాత్రం లాభాల్లో సాగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, సోమవారం చివర్లో భారీగా నష్టపోయిన ఐరోపా మార్కెట్లు మంగళవారం ప్రారంభంలోనే లాభాల్లో కొనసాగాయి.
నేటినుంచి మార్కెట్లోకి ఆల్‌కెమ్, డాక్టర్ లాల్ షేర్లు
ఇదిలా ఉండగా, ఇటీవలే విజయవంతంగా ఐపిఓలను పూర్తి చేసుకున్న ఆల్‌కెమ్ లేబరేటరీస్, పాక్టర్ లాల్ పాథ్‌లాబ్స్ షేర్లు బుధవారంనుంచి స్టాక్ మార్కెట్లలో తొలిసారి లిస్టింగ్ కానున్నాయి. బుధవారంనుంచి డాక్టర్ లాల్ పాథ్‌లాబ్స్, ఆల్‌కెమ్ లేబరేటరీస్ షేర్లు లిస్టింగ్ అవుతాయని, లావాదేవీలకోసం అనుమతించడం జరుగుతుందని బిఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రెండు కంపెనీల షేర్లు బిఎస్‌ఇతో పాటుగా ఎన్‌ఎస్‌ఇలోను లిస్టింగ్ అవుతాయి. డాక్టర్‌లాల్ పాథ్‌లాబ్ షేరు ఇష్యూ ధరను రూ.550లు, ఆల్‌కెమ్ లేబరేటరీస్ షేరు ఇష్యూధరను రూ.1.050గాను నిర్ణయించడం తెలిసిందే. ఇటీవల ఈ రెండు కంపెనీల ఐపిఓలకు ఆశించినదానికన్నా భారీ మద్దతు లభించడంతో అవి రెండూ ఓవర్‌సబ్‌స్క్రైబ్ కావడం తెలిసిందే.