బిజినెస్

‘ఇన్నోవేషన్ ప్రాజెక్టు’.. యువ శాస్తవ్రేత్తలకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 1,023 కోట్ల రూపాయల ఖర్చుతో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని రాంకీ ఇండియా లిమిటెడ్ సిఇఒ డాక్టర్ పి లాల్‌కృష్ణ తెలిపారు. రాంకీ కమర్షియల్ హబ్‌లో మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. సైంటిస్టులు ఔషధ ఫార్ములాలను తయారు చేసేందుకు కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందన్నారు. సైంటిస్టులు అంతమేర డబ్బును పెట్టుకునే అవకాశం ఉండదని, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని రాంకీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పరవాడ వద్దగల జెఎన్‌పిసిలో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫైలెట్ ప్లాంట్, కిలోప్లాంట్, టెస్టింగ్ ప్లాంట్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, యానమల్ టెస్టింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీని కోసం సుమారు 1,023 కోట్ల రూపాయలు అవసరం ఉందని, దీనికి ప్రభుత్వం వాటాగా 25 శాతం నిధులను, రాంకీ లిమిటెడ్ వాటాగా 25 శాతం, బ్యాంకుల నుండి 50 శాతం సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే సైంటిస్టులు తక్కువ ఖర్చుతోనే ఔషధ ఫార్ములా ద్వారా డ్రగ్‌ను తయారుచేసి మార్కెట్‌లో ప్రవేశ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,030 బిలియన్ డాలర్ల ఔషధాలను తయారు చేస్తున్నారని, వీటిలో 430 బిలియన్ డాలర్లు జనరిక్ ఔషధాల తయారీనేనన్నారు. అయితే భారత్‌లో కేవలం 40 బిలియన్ డాలర్ల ఔషధాలు తయారు అవుతున్నాయని, ఔషధ రంగంలో చైనా ముందు ఉంటుందని, దీనికి కారణం ఔషధ రంగాన్ని ప్రోత్సహించేందుకు చైనా దేశం కెమికల్స్, స్టీమ్, గ్యాస్, సిల్డ్‌వాటర్‌ను సబ్సిడీపై ఔషధ కంపెనీలకు అందిస్తుందన్నారు. ఈ అవకాశం భారత్‌లో లేదన్నారు. అందుకే మన దేశంలో తయారవుతున్న ఔషధాలకు సంబంధించిన 60 శాతం రా మెటీరియల్స్‌ను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఔషధం తయారు చేసేందుకు 40 శాతం పెట్టుబడి అవసరమని, అదే చైనాలో పెట్టుబడి తక్కువగా ఉంటుందన్నారు. భారత ఎగుమతుల్లో 65 శాతం సొమ్మును చైనాకు చెల్లించాల్సి వస్తోం దన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఫార్మా పార్కులు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయతే ప్రభుత్వాలు ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, చైనా తరహా ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసేందుకు ఆర్థికపరమైన తోడ్పాటు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.