బిజినెస్

13 బ్యాంకులకు 23 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌సహా మొత్తం 13 ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం దాదాపు 23 వేల కోట్ల రూపాయల మూలధనాన్ని కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సాయంలో ఇది తొలి విడత అవగా, బ్యాంకుల పనితీరుపైనే మరిన్ని నిధులు ఇవ్వాలా? వద్దా? అన్నది ఆధారపడి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలైన బాసెల్-3 నిబంధనల దృష్ట్యా నాలుగేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులకు 70,000 కోట్ల రూపాయలను అందించాలని కేంద్రం నిర్ణయించింది. నిజానికి బాసెల్-3 నిబంధనలను అందుకోవాలంటే ప్రభుత్వరంగ బ్యాంకులకు 1,80,000 కోట్ల రూపాయలు అవసరం. అయితే మిగతా సొమ్మును మార్కెట్ల నుంచి సమీకరించుకోవాలని బ్యాంకర్లకు ప్రభుత్వం సూచించింది. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరం (2015-16) 25,000 కోట్ల రూపాయలను బ్యాంకులకు అందించిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరం మరో 25,000 కోట్ల రూపాయలను అందిస్తామని ప్రకటించింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల చొప్పున 20,000 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో అవసరమైతే మరిన్ని నిధులను అందించేందుకు సిద్ధమని ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చినది తెలిసిందే. ఈ క్రమంలోనే 13 బ్యాంకులకు 22,915 కోట్ల రూపాయలను తొలి విడతగా అందించంది. కాగా, ఈ మూలధన సాయంతో ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు పెరగనున్నాయి. ఇదిలావుంటే తాజా ప్రభుత్వ నిర్ణయంతో మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్ల విలువలు పుంజుకున్నాయి. ఎస్‌బిఐ 0.48 శాతం, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 0.90 శాతం, కెనరా బ్యాంక్ 4.71 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ విలువ మాత్రం 0.83 శాతం పడిపోయింది.
మరింతగా మొండి బకాయిలు
ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరింతగా పెరగవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అన్నారు. మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 10.1 శాతానికి పెరగవచ్చని ఓ ఆర్‌బిఐ నివేదిక తెలిపిందంటూ చెప్పారు. కాగా, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 4.76 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 100 కోట్ల రూపాయలకు మించి బకాయిపడిన 701 మొండి బకాయిల విలువ 1.64 లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు.

ఏయే బ్యాంకులకు ఎంతెంత

ఎస్‌బిఐ
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సిండికేట్ బ్యాంక్
యూకో బ్యాంక్
కెనరా బ్యాంక్
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కార్పొరేషన్ బ్యాంక్
దేనా బ్యాంక్
అలహాబాద్ బ్యాంక్

రూ. 7,575 కోట్లు
రూ. 3,101 కోట్లు
రూ. 2,816 కోట్లు
రూ. 1,784 కోట్లు
రూ. 1,729 కోట్లు
రూ. 1,034 కోట్లు
రూ. 1,033 కోట్లు
రూ. 997 కోట్లు
రూ. 810 కోట్లు
రూ. 721 కోట్లు
రూ. 677 కోట్లు
రూ. 594 కోట్లు
రూ. 44 కోట్లు