బిజినెస్

మార్కెట్‌కు ఫార్మా జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 20: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ ఔషధరంగ సంస్థలు సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్, అరబిందో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొలెస్ట్రాల్ డ్రగ్ క్రెస్టర్‌కు చెందిన జనరిక్ వెర్షన్స్ అమ్మకాలను అమెరికా మార్కెట్‌లో చేసుకోవచ్చని ఆ దేశ హెల్త్ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతినివ్వడం మదుపరులను ఉత్సాహపరిచింది. దీంతో ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 128.27 పాయింట్లు ఎగిసి 27,915.89 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 37.30 పాయింట్లు పెరిగి 8,565.85 వద్ద నిలిచింది. రియల్టీ, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, పవర్, ఎనర్జీ, యుటిలిటీస్, పిఎస్‌యు, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లూ 2.41 శాతం నుంచి 0.76 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా సన్ ఫార్మా షేర్ విలువ 1.89 శాతం, గ్లెన్‌మార్క్ షేర్ విలువ 2.39 శాతం, అరబిందో షేర్ విలువ 5.09 శాతం మేర పెరిగాయి. ఇక ఆసియా మార్కెట్లలో సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు నష్టపోగా, హాంకాంగ్, చైనా సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.
సన్, గ్లెన్‌మార్క్, అరబిందోలకు లైన్‌క్లియర్
న్యూఢిల్లీ, జూలై 20: భారతీయ ఔషధరంగ సంస్థలు సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్, అరబిందో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొలెస్ట్రాల్ డ్రగ్ క్రెస్టర్‌కు చెందిన జనరిక్ వెర్షన్స్ అమ్మకాలకు అమెరికా మార్కెట్‌లో గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కొలెస్ట్రాల్ డ్రగ్ అమ్మకాలు చేసుకోవచ్చని ఆ దేశ హెల్త్ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతినిచ్చింది. 5 ఎమ్‌జి, 10 ఎమ్‌జి, 20 ఎమ్‌జి, 40 ఎమ్‌జి సామర్థ్యం కలిగిన జనరిక్ రోసువస్టాటిన్ కాల్షియం టాబ్లెట్ల అమ్మకాలకు సంబంధించి యుఎస్‌ఎఫ్‌డిఎ నుంచి సన్, గ్లెన్‌మార్క్, అరబిందో సంస్థలకు ఆమోదం లభించింది. మే నెలతో ముగిసిన సంవత్సర కాలంలో క్రెస్టర్ టాబ్లెట్ల అమ్మకాలు దాదాపు 6.78 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం.