బిజినెస్

మొండి బకాయిల సమస్య పరిష్కారం దిశగా ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 20: ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిలను వదిలించుకోవడంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. బుధవారం అమెరికాకు చెందిన సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌తో కలిసి 7,350 కోట్ల రూపాయల ఒత్తిడి ఆస్తుల నిధిని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బిఐ నికర నిరర్థక ఆస్తులు 55,807 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, ఇప్పటికే కొటక్ మహీంద్ర బ్యాంక్.. కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డుతో కలిసి ఇదే తరహా నిధి ఏర్పాటు చేసింది. దీని విలువ 525 మిలియన్ డాలర్లు.

‘అప్రెంటీస్‌ల కోసం రూ. 18 వేల కోట్లు’
న్యూఢిల్లీ, జూలై 20: అర్హత కలిగిన యువతను అప్రెంటీస్‌షిప్‌లో భాగంగా నియమించుకుంటున్న ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలకు 18,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో కోశ్చన్ అవర్ సందర్భంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రుడి తెలియజేశారు. మూడేళ్లలో 50 లక్షల మంది అప్రెంటీస్ యువత తమ లక్ష్యమన్న ఆయన ప్రస్తుతం 2.5 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు తెలిపారు. చైనాలో మూడు కోట్ల మంది, జపాన్‌లో రెండు కోట్ల మంది అప్రెంటీస్‌లుగా ఉన్నారన్నారు.

బేస్ రేటును తగ్గించిన యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ తమ కనీస రుణ రేటును స్వల్పంగా తగ్గించింది. బేస్ రేటును ఇప్పుడున్న 9.45 శాతం నుంచి 10 బేసిస్ పాయింట్లు దించి 9.35 శాతానికి చేర్చింది. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. కాగా, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎమ్‌సిఎల్‌ఆర్)ను కూడా యాక్సిస్ బ్యాంక్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ మెచ్యూరిటీల కోసం 0.05-0.1 శాతం వరకు కోత వేసింది. ఈ నెల 18 నుంచే ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది.