బిజినెస్

దొనకొండలో విమానాలు, హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 20: ప్రకాశం జిల్లాలోని దొనకొండలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విమానాలు, హెలికాప్టర్ల తయారి పరిశ్రమను స్థాపించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. బుధవారం ఒంగోలులోని మంత్రి నివాసంలో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. వారితో మాట్లాడిన అనంతరం మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు చైనా, సింగపూర్, జపాన్ దేశాలను పర్యటించారన్నారు. కాగా, మంగళవారం రాత్రి ఉక్రెయిన్ పారిశ్రామికవేత్తల ప్రతినిధుల బృందం విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి దొనకొండలో టైటాన్ ఏవియేషన్ ఏరోస్పేస్ లిమిటెడ్‌కు ఆరువేల ఎకరాల భూములు కావాల్సిందిగా కోరారన్నారు. ముఖ్యమంత్రి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దొనకొండలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో టైటాన్ కంపెనీ విమానాలు, హెలికాప్టర్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆరువేల ఎకరాల భూములు సిద్దంగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఆరు కిలోమీటర్ల రన్‌వే ఏర్పాటుచేస్తామని బృందం తెలియచేసిందన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో దశల వారీగా పెట్టుబడులు పెట్టేందుకు టైటాన్ కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. తొలివిడతగా మూడువేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టును ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. దీంతో సుమారు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల మేర అభివృద్ధి చెందుతుందని, 20 వేల మందికి ఉపాధి అవకాశాలూ లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ దేశ ప్రతినిధులు అలెగ్జాండ్ర, ఓలే సాండర్ చెచయి, లోగర్‌సన్‌స్టవ్‌ను మంత్రి శిద్దా, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి సన్మానించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా,
చోళ మండలం మధ్య ఎమ్‌ఒయు

హైదరాబాద్, జూలై 20: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎంఎస్ చోళమండలం బీమా సంస్థల మధ్య బుధవారం ఇక్కడ పరస్పర అవగాహన ఒప్పందం (ఎమ్‌ఒయు) ఖరారైంది. బ్యాంక్ ద్వారా తమ సంస్థకు చెందిన నాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను విక్రయిస్తామని చోళమండలం ఎండి ఎస్‌ఎస్ గోపాలరత్నం తెలిపారు. ఈ ఒప్పందంపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి పిఎస్ జయకుమార్, చోళమండలం ఎండి గోపాలరత్నం సంతకాలు చేశారు. కాగా, ప్రజల అవసరాలు, డిమాండ్‌కు తగ్గట్టుగా బీమాలు రూపొందించినట్లు చోళమండలం తెలిపింది.