బిజినెస్

సిరులు కురిపిస్తున్న సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 22: సాంకేతిక సొగసులతో వరంగల్ జిల్లాకే భూపాలపల్లి కోల్‌బెల్ట్ ఏరియా తలమానికంగా మారింది. ఏరియాలో బొగ్గు గనుల విస్తరణతో పాటు వ్యాపార రంగంగా దినదినం వృద్ధి చెందుతుంది. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి కాంతిపుంజమై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న సింగరేణి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి భూపాలపల్లిలో ముస్తాబు అవుతోంది. సింగరేణి వేడుకలను యాజమాన్యం ప్రత్యేక ఏర్పాటు చేసింది.
1979లో ప్రారంభమైన పనులు
1979 సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం బొగ్గు నిక్షేపాల కోసం అనే్వషణ కొనసాగింది. ఈసందర్భంగా 664.99 మిలియన్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అనే్వషణ ద్వారా తెలుసుకుంది. అనంతరం 1988 జూలై 10న నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టి రామారావు కాకతీయ గనులకు శంఖుస్థాపన చేశారు. నాటి కెటికె గని నుంచి ప్రారంభమైన ఈ ప్రస్తావం ఏరియాలో అదనంగా అండర్‌గ్రౌండ్ గనులు, ఓపెన్‌కాస్టు గనులు, లాంగ్‌వాల్ ప్రాజెక్టు గనులు కూడా రాబోతున్నాయి. కాకతీయ గనులు సింగరేణిలో అత్యంత నాణ్యమైన బొగ్గును అందిస్తూ సంస్థకు సిరులు కురిపిస్తున్నాయి. సింగరేణి యాజమాన్యం ప్రస్తుతం భూపాలపల్లి పైనే అధికంగా దృష్టిసారించింది. భారీ బొగ్గు నిక్షేపాలకు తోడు స్థానికంగా సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా బి గ్రేడ్ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం సింగరేణికి తలమానికమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అత్యంత విలువైన బి గ్రేడ్ నిల్వలు
భూపాలపల్లి ప్రాంతంలో అత్యంత విలువైన బి గ్రేడు నిల్వలున్నాయని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో బి గ్రేడ్ బొగ్గుకు అధిక ధర పలకడంతో నష్టాల భారీలో ఉన్న కాకతీయ గనులు కొంత వరకు లాభాల బాట పట్టే అవకాశ ఏర్పడిందని కార్మికులు పేర్కొంటున్నారు. అయితే గనులలో కార్మిక శక్తికి బదులు యంత్రాల శక్తి పైనే సింగరేణి యాజమాన్యం దృష్టి సారించడంలో సందేహం లేదని చెప్పవచ్చు. ఏరియాలో గ్రేడ్‌యెంట్ ఎక్కువగా ఉందని మరికొన్ని యంత్రాలను సమకూర్చుతుందని కార్మికులు పేర్కొంటున్నారు. గతంలో భూపాలపల్లి ఏరియాలో 8వేలకు పైగా కార్మికులు ఉండగా నేడు కార్మికులు తగ్గుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా యాజమాన్యం ఓసిపిలుగా మార్చి యంత్రాలను సైతం ఉపయోగిస్తున్నారు.
రానున్న రోజులలో బొగ్గు గనులలో కార్మిక శక్తి రోజురోజుకు తగ్గించే ప్రయత్నంలో సింగరేణి సంస్థ ముందుకు వెళ్తుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.