బిజినెస్

జిఎస్‌టిపై ఆశాభావంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 92.72 పాయింట్లు పుంజుకుని 27,803.24 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.10 పాయింట్లు పెరిగి 8,541.20 వద్ద నిలిచింది.
ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి గురువారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాలు బాగుండటంతో శుక్రవారం ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి.
అయితే బ్యాంక్ ఆఫ్ జపాన్ చీఫ్ హరుహికో కురోడా.. ‘హెలికాప్టర్ మనీ’పై చేసిన వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మధ్యాహ్నం వరకు సూచీలు లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. అయితే వచ్చేవారం కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రాజ్యసభలో చర్చకు వస్తుందన్న సంకేతాలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. పవర్, యుటిలిటీస్, మెటల్, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, టెలికామ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ఐటి రంగ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభపడ్డాయి.
కెయిర్న్, బయోకాన్
మార్కెట్ విలువ పైపైకి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను కెయిర్న్, బయోకాన్ సంస్థలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపరులను మెప్పించాయి. దీంతో కెయిర్న్ ఇండియా మార్కెట్ విలువ శుక్రవారం 2,887.36 కోట్ల రూపాయలు పెరిగింది.
బయోకాన్ మార్కెట్ విలువ సైతం 2,144 కోట్ల రూపాయలు ఎగిసింది. ఫలితంగా ఇప్పుడు కెయిర్న్ ఇండియా మార్కెట్ విలువ 35,997.36 కోట్ల రూపాయలను తాకితే, బయోకాన్ మార్కెట్ విలువ 16,174 కోట్ల రూపాయలకు చేరింది.
ఎన్‌ఎస్‌ఇలో బాండ్ల వేలం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ).. సోమవారం విదేశీ మదుపరుల కోసం 7,264 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది.
సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు విదేశీ మదుపరులకు ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను వేలం వేస్తుంది.