బిజినెస్

క్షీణించిన యాక్సిస్ బ్యాంక్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 22: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 21 శాతం క్షీణించి 1,555.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 1,978.44 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 13,852.1 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,234.41 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, మొండి బకాయలు పెరగడమే తాజా లాభాల పతనానికి కారణమని శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది. స్థూల నిరర్థక ఆస్తులు నిరుడు జూన్ నాటికి 4,251 కోట్ల రూపాయలుగా నమోదైతే, ప్రస్తుత సంవత్సరం జూన్ నాటికి 9,553 కోట్ల రూపాయలకు పెరిగాయ.

వొడాఫోన్ ఇండియా ఆదాయం 1,519 మిలియన్ పౌండ్లు
న్యూఢిల్లీ, జూలై 22: బ్రిటన్‌కు చెందిన టెలికామ్ దిగ్గజం వొడాఫోన్.. భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1,519 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 1,573 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని పొందింది. దీంతో ఈసారి 3.4 శాతం మేర ఆదాయం తగ్గినట్లైంది. అయితే భారత కరెన్సీ ప్రకారం చూస్తే మాత్రం 3.92 శాతం పెరిగింది. పౌండ్‌తో పోల్చితే రూపాయి విలువ 75.56 రూపాయలుగా ఉండగా, ఈసారి ఆదాయం 11,477.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయినసారి ఇది 11,016 కోట్ల రూపాయలుగా ఉందని శుక్రవారం సంస్థ ఇక్కడ తెలిపింది.
కెయిర్న్ భాగస్వాములకు
వేదాంత బిగ్ ఆఫర్
న్యూఢిల్లీ, జూలై 22: పీకల్లోతు రుణాల్లో కొట్టుమిట్టాడుతున్న మాతృ సంస్థ వేదాంత లిమిటెడ్‌లో భారీ నగదు నిల్వలతో తులతూగుతున్న కెయిర్న్ ఇండియా విలీనానికి మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెయిర్న్ ఇండియాకు చెందిన మైనారిటీ భాగస్వాములకు ఒక ఈక్విటీ షేర్‌కు 10 రూపాయల ముఖ విలువ కలిగిన నాలుగు రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను ఇస్తామని వేదాంత శుక్రవారం ప్రకటించింది. ఎల్‌ఐసి వంటి సంస్థలు కెయిర్న్ ఇండియా మైనారిటీ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా, ఈ విలీనంతో రుణ భారాన్ని తగ్గించుకోవాలని వేదాంత భావిస్తోంది.