బిజినెస్

ఒక్కరోజులోనే పాన్, టాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్), ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ (టాన్)లను ఇక ఒక్కరోజులోనే సంస్థలు పొందవచ్చు. అవసరమున్న సంస్థలు డిజిటల్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఆధారిత దరఖాస్తును సమర్పిస్తే చాలు.. 24 గంటల్లోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్ అందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భాగంగానే ఈ సంస్థాగత మార్పు అని ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. మరోపక్క వ్యక్తిగతంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారికీ మార్గం సుగమం చేసింది ఆదాయ పన్ను శాఖ. ఆధార్ ఆధారిత ఈ-సిగ్నేచర్ సదుపాయం ద్వారా పాన్ కార్డును పొందే వెసులుబాటును కల్పించింది. దీనివల్ల ఇంతకుముందు కంటే తక్కువ సమయంలోనే పాన్ కార్డు చేతికొస్తుంది. ‘సంస్థాగత దరఖాస్తుల కోసం పాన్, టాన్‌ల మంజూరీని వేగవంతం చేశాం. పాన్ సేవలందించే ఎన్‌ఎస్‌డిఎల్ ఈజిఒవి, యుటిఐఐటిఎస్‌ఎల్ పోర్టల్స్‌పై డిజిటల్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఆధారిత దరఖాస్తు ప్రక్రియను పరిచయం చేశాం. ఈ కొత్త ప్రక్రియలో దరఖాస్తు సమర్పిస్తే పాన్, టాన్‌లను ఒక్కరోజు వ్యవధిలోనే కేటాయించడం జరుగుతుంది.’ అని ఆదాయ పన్ను శాఖ ప్రకటన ఒకటి స్పష్టం చేసింది. ‘వ్యక్తిగత పాన్ కార్డు దరఖాస్తుదారుల కోసం కూడా సరికొత్తగా ఆధార్ ఈ-సిగ్నేచర్ ఆధారిత దరఖాస్తు ప్రక్రియను పరిచయం చేస్తున్నాం. పాన్ సేవలందించే పోర్టల్స్‌పై దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల దరఖాస్తుదారుడికి సమయం కలిసొస్తుంది. త్వరగా కేటాయించడం జరుగుతుంది. ఆధార్ అనుసంధానంతో డూప్లికేట్ పాన్ కార్డులకూ కళ్లెం వేసినట్లవుతుంది.’ అని సదరు ప్రకటన పేర్కొంది. తద్వారా పేపర్ రహిత దరఖాస్తులనూ అందుబాటులోకి తెస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ చెబుతోంది. కాగా, పైన పేర్కొన్న విధంగా దరఖాస్తుల కోసం యుఆర్‌ఎల్ లింక్స్.. ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్ జశష్యౄళఆ్ఘనజశజూజ్ఘ.్య్ప.జశ హోమ్‌ఫేజ్‌పైగల ‘ఇంపార్టెంట్ లింక్స్’లో అందుబాటులో ఉంటాయని ప్రకటన తెలిపింది.