బిజినెస్

దక్షిణాది మార్కెట్‌లో అడుగుపెట్టిన స్కిప్పర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: పాలిమర్ పైపుల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్కిప్పర్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో పాలిమర్ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ దేవేష్ బన్సల్ తెలిపారు. మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో 2.25 ఎకరాల విస్తీర్ణంలో ప్లంబింగ్, వ్యవసాయ పైపుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పామని, వంద మంది ఉద్యోగులను నియమించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాలిమర్ పైపులను తయారు చేస్తామని, దేశీయ టెక్నాలజీతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు.

రెండు నెలల్లోనే 5.34 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ
న్యూఢిల్లీ, జూలై 22: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెలల్లో దేశంలోకి 5.34 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 4.76 బిలియన్ డాలర్లు ఆటోమెటిక్ మార్గం ద్వారా వచ్చాయని, మిగతా 582 మిలియన్ డాలర్లు ఆమోదించడం ద్వారా అందుకున్నామని వివరించారు. వివిధ రంగాల్లో ఎఫ్‌డిఐ విధానంలో మార్పులు తీసుకువచ్చినట్లు కూడా ఆయన తెలియజేశారు.

ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియాపై రాయల్టీ భారం
న్యూఢిల్లీ, జూలై 22: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసిపై అదనంగా 392 కోట్ల రూపాయల రాయల్టీ భారం పడనుంది. అలాగే మరో ప్రభుత్వరంగ చమురు అనే్వషణ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్)పై 1,100 కోట్ల రూపాయల భారం పడనుంది. నికర ముడి చమురు ధర ప్రకారం కాకుండా స్థూల ముడి చమురు ధర ప్రకారం రాయల్టీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడమే ఇందుకు కారణం. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా ఇవ్వనున్నాయి. ఒఎన్‌జిసి చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 91.86 కోట్ల రూపాయలు రానుంది.