బిజినెస్

ఆ నిర్ణయంతో ఒరిగేదేమీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: పదేళ్లకుపైబడిన డీజిల్ ఆధారిత వాహనాలను స్క్రాపింగ్ చేయడం ద్వారా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందంటే ఆశ్చ ర్యం అనిపిస్తోంది అని దేశీయ ఆటోరంగ దిగ్గజం మారు తి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. నిజానికి ఈ నిర్ణయం వల్ల భారత ఆటో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ నిర్ణయం.. దాదాపు 2 లక్షల మంది కార్ల యజమానులకు శరాఘాతమని, వారి వాహన ఆస్తి తుక్కుకెళ్తోందని అన్నారు. వాస్తవానికి ఢిల్లీలో కాలుష్యకారకమవుతున్నాయన్న ఆ కార్ల ద్వారా జరుగుతున్న కాలుష్యం కేవలం 2.2 శాతమే అన్నారు. ఇది ఐఐటి కాన్పూర్ అధ్యయనంలో తేలిన నిజమని ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ భార్గవ అన్నారు. కాబట్టి ఇది కచ్ఛితంగా సరైన నిర్ణయం కాదని, దీనివల్ల ఆశించిన స్థాయిలో ఫలితం ఉండబోదని అభిప్రాయపడ్డారు. మొత్తానికి డీజిల్ కార్ల నిషేధం ద్వారా ఢిల్లీలో కాలుష్యం మెరుగవుతుందని నేనైతే అనుకోవడం లేదన్నారు.