బిజినెస్

ఫోర్బ్స్ ‘సూపర్ 50’ భారతీయ సంస్థల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: దేశీయ ఐటిరంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్, ఔషధరంగ దిగ్గజాలైన సన్ ఫార్మా, లుపిన్, ప్రైవేట్‌రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు.. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ భారతీయ సూపర్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రముఖ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్, ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) ఈ ఏడాది జాబితాలో స్థానం పొందలేకపోయాయి. ఇక నిరుడు మాదిరిగానే ఈ ఏడాది కూడా జాబితాలోకి కొత్తగా 14 సంస్థలు వచ్చి చేరాయి. ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, భారత్ ఫోర్జ్, అలెంబిక్ ఫార్మా, జిల్లెట్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కన్సాయ్ నెరోలాక్, ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ తదితర సంస్థలకు ఈసారి చోటు లభించింది. అయితే టాటా మోటార్స్, హెచ్‌యుఎల్‌తోపాటు ఎమ్‌ఆర్‌ఎఫ్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్, హెచ్‌డిఎఫ్‌సి, కొటక్ మహీంద్ర బ్యాంక్‌లు చోటు కోల్పోయాయి. పిడబ్ల్యుసి ఇండియాతో కలిసి ఫోర్బ్స్ మూడంచెల విధానాన్ని అవలంభించి ఈ జాబితాను రూపొందించింది. జాబితాలో నుంచి సంస్థలను తీసివేయడం, తీసుకురావడం వంటి వాటిని చేపట్టింది. మార్కెట్ వాటా, అమ్మకాలు, గడచిన మూడేళ్ల వ్యవధిలో లాభాలు, పెట్టుబడుల, విస్తరణ, తదితర అంశాల ఆధారంగా జాబితాను ఫోర్బ్స్ తీర్చిదిద్దింది.