బిజినెస్

మింత్రా గూటికి జబాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా.. తమ ప్రత్యర్థి జబాంగ్‌ను చేజిక్కించుకుంది. దాదాపు 470 కోట్ల రూపాయలకు (70 మిలియన్ డాలర్లు) గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ (జిఎఫ్‌జి) నుంచి కొనుగోలు చేసింది. జబాంగ్‌ను సొంతం చేసుకోవాలని స్నాప్‌డీల్, ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన ఎబోఫ్ తదితర సంస్థలు పోటీపడినా ఫలితం లేకపోయింది. ఇక మొత్తం నగదు లావాదేవీలోనే జరిగిన ఈ కొనుగోలుకు చెల్లించిన సొమ్ము నిరుడు మింత్రా అందుకున్న రెవిన్యూలో సగానికి సమానమవగా, మింత్రా చేతికి జబాంగ్ రావడంతో దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమలో ఇక మింత్రాదే ఆధిపత్యం కానుంది. మహిళల దుస్తుల వంటి విభాగాల్లో జబాంగ్‌కు మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పుడు ఇది మింత్రాకు కలిసిరానుంది. మరోవైపు జబాంగ్ అమ్మకంతో జిఎఫ్‌జి మళ్లీ దాని కోర్ మార్కెట్ల వ్యాపారంపై దృష్టి సారించనుంది. ఇక ఈ లావాదేవీలు డిసెంబర్‌కల్లా పూర్తి కావచ్చని తెలుస్తోంది. ‘్ఫ్యషన్, లైఫ్‌స్టయిల్ విభాగాలు భారతీయ ఈ-కామర్స్ రంగానికి అత్యంత ప్రధాన చోదక శక్తులు. మేము ఎల్లప్పుడు ఈ విభాగాలను విశ్వసిస్తాం. జబాంగ్ కొనుగోలుతో మింత్రా కార్యకలాపాలు మరింతగా బలపడతాయి.’ అని ఫ్లిప్‌కార్ట్ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు బిన్ని బన్సల్ అన్నారు. కాగా, భారతీయ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ వివరాల ప్రకారం ఈ-కామర్స్ వ్యాపారం ఏటేటా 57 శాతం వృద్ధితో పరుగులు పెడుతోంది. 2014 డిసెంబర్‌లో 24,046 కోట్ల రూపాయలుగా ఉన్న ఆన్‌లైన్ వ్యాపారం.. 2015 డిసెంబర్‌కు 37,689 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక ఈ ఏడాది ఆఖరుకైతే ఇది ఏకంగా 72,639 కోట్ల రూపాయలను తాకుతుందని అంచనా. ఇటీవలికాలంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు విపరీతం కావడమే దీనికి కారణం. ‘జబాంగ్ ద్వారా నెలకు 40 లక్షల మంది కొనుగోళ్లు జరుపుతున్నారు. దీనిపై చాలా అంతర్జాతీయ బ్రాండ్ల ట్రేడింగ్ జరుగుతోంది. 1,500లకుపైగా అంతర్జాతీయ హై-స్ట్రీట్ బ్రాండ్లు టై-అప్ అయ్యాయి. ఇకపై మింత్రా వ్యాపారంతోపాటు జబాంగ్ వ్యాపారాభివృద్ధిపైనా దృష్టి పెడతాం.’ అని మింత్రా సిఇఒ అనంత్ నారాయణన్ అన్నారు. ఇదిలావుంటే 2014లో మింత్రాను 2,000 కోట్ల రూపాయలకు ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. మింత్రా ద్వారా నెలకు కోటిన్నర మంది కొనుగోళ్లు చేస్తున్నారు. మొత్తానికి జబాంగ్ కొనుగోలుతో మింత్రా ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో దూసుకెళ్లడం ఖాయమని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.