బిజినెస్

ఆర్‌బిఐ గవర్నర్ రేసులో ఉన్నానో.. లేనో.. చెప్పలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్ రేసులో తన అభ్యర్థిత్వంపై ఊహాగానాలను కొనసాగిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య.. దీనిపై తాను స్పందించలేనన్నారు. ఇదంతా మీడియా ఊహాగానాలేనన్న ఆమె తాను ఆర్‌బిఐ చీఫ్ రేసులో లేనని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో పాల్గొన్న భట్టాచార్య.. ఆర్‌బిఐ నూతన గవర్నర్ రేసులో తన అభ్యర్థిత్వంపై స్పందిస్తూ ‘దానిపై నేను ఏమీ చెప్పలేను. దీనికి సంబంధించి ఊహాగానాలకు తెరలేపినది మీడియానే.’ అని అన్నారు. ప్రస్తుత ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్ 4తో ముగియనున్నది.
పలు ఆసక్తికర పరిణామాల మధ్య మరోసారి ఆర్‌బిఐ పదవి తాను చేపట్టలేనని రాజన్ ప్రకటించినది తెలిసిందే. అయితే మళ్లీ ఆర్‌బిఐ చీఫ్‌గా ఉండాలని ఉందని, చేయాల్సినది చాలానే మిగిలిపోయిందని రాజన్ అంతకుముందు అన్నారు. అయితే పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ఆర్‌బిఐకి మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలు రాజన్‌కు ఆ అవకాశాన్ని దూరం చేశాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారే ఆర్‌బిఐ చీఫ్ పదవి వార్తల్లో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తిరిగి తాను అధ్యాపక వృత్తిలోకే వెళతానని రాజన్ స్పష్టం చేశారు. నిజానికి రాజన్ కంటే ముందు గడచిన 23 ఏళ్లలో ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసినవారంతా కూడా వరుసగా రెండుసార్లు ఆ పదవిలో కొనసాగినవారే. సి రంగరాజన్ (1992-97), బిమల్ జలాన్ (1997-03), వైవి రెడ్డి (2003-08), దువ్వూరి సుబ్బారావు (2008-13) ఐదేళ్ల చొప్పున పనిచేశారు. ఈ సంప్రదాయానికి తెర దించుతూ రాజన్ మాత్రమే మూడేళ్లకు పరిమితమవుతున్నారు. కొత్త గవర్నర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది కూడా. ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యతోపాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్, ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ తదితరుల పేర్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సుతో ప్రధాన మంత్రి కొత్త గవర్నర్ పేరును ప్రకటిస్తారు.
మార్చిలోగా బ్యాంకుల విలీనం
అనుబంధ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసే నిర్ణయంపై ఓ వైపు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు దిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోగా అనుబంధ బ్యాంకుల విలీనం పూర్తవుతుందని ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌లను వాటి మాతృ సంస్థ ఎస్‌బిఐలో విలీనం చేస్తున్నారు. శుక్రవారం ఇక్కడ వెల్త్ మేనేజ్‌మెంట్ ఉత్పత్తి ఎస్‌బిఐ ఎక్స్‌క్లుసిఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే 7,575 కోట్ల రూపాయల మూలధనం బ్యాంక్ లోన్ల వృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య