బిజినెస్

దూసుకెళ్తున్న వాల్తేరు డివిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 31: భారతీయ రైల్వేకు ఆర్థిక వెనె్నముకగా నిలుస్తున్న వాల్తేరు డివిజన్.. ఇపుడు సరుకు రవాణాలో అన్ని జోన్ల కంటే అగ్రగామిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 55.66 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 6,456.84 కోట్ల రూపాయల ఆదాయాన్ని వాల్తేరు డివిజన్ సంపాదించగలిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-14) కంటే ఇది 4.82 శాతం అధికం. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) నాటికి దీనిని కనీసం ఆరు శాతానికైనా పెంచాలని లక్ష్యంగా చేసుకుంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మించి నమోదు చేయాలని వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టింది. సరుకు రవాణా కోసం ఎప్పటికపుడు వ్యాగన్లను అందుబాటులోకి తీసుకురావడం, రవాణాలో జాప్యం లేకుండా చూడటం, వ్యాగన్ల కొరతను అధిగమించడం, మార్గమధ్యంలో అసాంఘికశక్తుల నుంచి వీటికి భద్రత కల్పించడం వంటి చర్యల ద్వారా మరింతగా లక్ష్యాలను పెంచుకోవాలని నిర్ణయించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) లోనూ ఇప్పటిదాకా బొగ్గు, రసాయనాలు, స్టీల్, అల్యుమినియం తదితర సరుకు లోడింగ్ ద్వారా ఈ డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచింది. భారతీయ రైల్వే పరిధిలోకి వచ్చే 16 రైల్వేజోన్ల పరిధిలో మరెక్కడా సాధించలేని ఫలితాలను ఈ డివిజన్ చేరుకోగలిగింది. కాగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో మూడు డివిజన్లుండగా, సంబల్‌పూర్, ఖుర్దాలతోపాటు వాల్తేరు డివిజన్ ఒకటి. వీటిలో వాల్తేరు డివిజన్ మాత్రమే సరుకు రవాణాతోపాటు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 35.05 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 466 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. గత రెండేళ్ళ కాలంగా విశాఖపోర్టు ట్రస్టు నుంచి ప్రతిరోజు కనీసం 12 గూడ్స్ రైళ్ళు (రేక్స్) నడుస్తున్నాయి. ఒక్కోసారి 15 నుంచి 18 గూడ్స్‌లు సైతం వెళ్తున్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఎనిమిది, ఎన్‌టిపిసి నుంచి 11 గూడ్స్ రైళ్ళు నడుస్తున్నాయి. ఎక్కువగా బొగ్గు, ఇనుప ఖనిజం, ఆహార ధాన్యాలు వంటివి రవాణా అవుతున్నాయి. ఒక్కో గూడ్స్ రైలుకు కనీసం 40 నుంచి 50 వ్యాగన్లు ఉంటాయి. వీటిని లాగేందుకు జపాన్, జర్మనీల నుంచి తెచ్చిన ఇంజన్లను వాడుతున్నారు. అందువలనే రవాణా సమయాన్ని తగ్గిస్తూ ఎటువంటి జాప్యం లేకుండా సరుకును గమ్యానికి చేర్చగలుగుతున్నారు అధికారులు.
వాల్తేరుపై ఒడిశా కన్ను!
సరుకు రవాణా ద్వారా ఆర్థిక లక్ష్యాలను సాధిస్తున్న వాల్తేరు డివిజన్‌పై ఒడిశా కనే్నసింది. సరుకు రవాణా చేస్తున్న గూడ్స్ రైళ్ళల్లో ఖాళీ అయ్యే వ్యాగన్లను తరలించుకుపోతుందంటూ సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే వాల్తేరు డివిజన్‌కు సంబంధించిన వ్యాగన్ల తరలింపుతో సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒడిశా పరిధిలో ఉన్న రాయగడ, అంబుదాం, టిట్లాఘర్, సంబల్‌పూర్, బలంగీర్ తదితర ప్రాంతాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. అలాగే బొగ్గు గనులకు కొదవ లేదు. అందువల్ల వీటి రవాణాకు అవసరమైన వ్యాగన్లను సమకూర్చుకోవాలంటే జరిగే పనికాదని తెలుసుకున్న ఒడిశా.. ఉన్నతాధికారులపై ఒత్తిళ్ళు తీసుకువచ్చి మరీ వాల్తేరు డివిజన్‌కు చెందిన గూడ్స్ వ్యాగన్లను తరలించుకోపోవడంపైనే దృష్టిపెడుతోంది. దీనివల్ల వాల్తేరు డివిజన్‌లో కొన్ని సందర్భాల్లో వ్యాగన్ల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని సంబంధిత సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాగన్ల తరలింపులో ఒడిశా ఆధిపత్యాన్ని తగ్గించగలిగితే వార్షిక లక్ష్యాలను మరింతగా పెంచేందుకు అవకాశాలుంటాయని అంటున్నారు.