బిజినెస్

ప్రమాద మృతులకు రూ. 10 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఎంతోకాలంగా వేచిచూస్తున్న మోటార్ వాహనాల (సవరణ) బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు అమలుతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు పడనున్నాయి. మద్యం సేవించి నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా, ప్రమాద తీవ్రతనుబట్టి 2 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో గరిష్ఠంగా 10 లక్షల రూపాయల వరకు మృతులకు ఎక్స్‌గ్రేషియా లభిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు మోటార్ వెహికిల్ (అమెండ్‌మెంట్) బిల్లు 2016కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశం అనంతరం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిటిఐతో మాట్లాడుతూ ఈ బిల్లుతో రోడ్ల భద్రత పెరుగుతుందని, లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో పోకుండా కాపాడగలుగుతామని అన్నారు. ఈ బిల్లు ప్రకారం అతి వేగానికి వెయ్యి రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని, బీమా లేకుండా వాహనం నడిపితే 2 వేల రూపాయల జరిమానా పడుతుందని, మూడు నెలల జైలుశిక్ష కూడా ఉంటుందని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కూడా 2 వేల రూపాయల జరిమానా వేస్తామని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశామని చెప్పారు. కాగా, మైనర్లు ట్రాఫిక్ నిబంధనలను మీరితే, ప్రమాదాలకు కారణమైతే వారి సంరక్షకులు లేదా వాహన యజమానులపై చర్యలుంటాయని, వాహన లైసెన్సును కూడా రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.