బిజినెస్

రూ. 9,999లకే ల్యాప్‌ట్యాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: టెక్ సంస్థ ఆర్‌డిపి వర్క్‌స్టేషన్స్.. బుధవారం ఇక్కడ ‘తిన్‌బుక్’ పేరిట 14.1 అంగుళాల చౌక ల్యాప్‌ట్యాప్‌ను పరిచయం చేసింది. దీని ధర 9,999 రూపాయలు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు దీన్ని ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా దీన్ని రూపొందించామని, ఇదే ఇప్పటిదాకా అత్యంత చౌక ల్యాప్‌ట్యాప్ అని కూడా సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. దిగువ, మధ్యతరగతి వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. ఇక ఈ ల్యాప్‌ట్యాప్‌లో ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జెడ్8300 ప్రాసెసర్, ఆన్-బోర్డ్ హైస్పీడ్ యుఎస్‌బి 3.0 సౌకర్యం కలదు. విండోస్ 10 సాఫ్ట్‌వేర్‌పై నడిచే ఈ తిన్‌బుక్ ల్యాప్‌ట్యాప్‌లో 10 రెట్లు అధిక డేటా బదిలీ వేగం ఉంటుందని ఆర్‌డిపి వర్క్‌స్టేషన్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ రెడ్లపల్లి తెలిపారు.
నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: కెటిఆర్
తెలంగాణను అంతర్జాతీయ ఐటి రంగంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ రిస్క్ అండ్ కాంప్లియెన్స్ కొరకు ఏర్పాటు చేసిన కాగ్నిటివ్ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన, రిస్క్, కాంప్లియెన్స్ తదితర సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఐటి రంగం కొత్త పరిష్కారాలను చూపాలన్నారు. ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమల కోసం డొమైన్ స్పెసిఫిక్ పరిష్కారాలు చూపించడంపై ఐటి నిపుణులు దృష్టిని సారించాలన్నారు. కాగ్నిటివ్ హబ్ ప్రధానంగా కాగ్నిటివ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజస్ ప్రోసెసింగ్, బిగ్ డేటా, సెమాటిక్ మోడలింగ్, నాలెడ్జ్ సిస్టమ్స్ టెక్నాలజీ డొమైన్స్ తయారుచేయడంపై ప్రణాళిక ఖరారు చేయడాన్ని ఆయన అభినందించారు. హైదరాబాద్‌లో ఐటి రంగంలో ప్రతిభావంతులైన వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గణేష్ అయ్యర్ మాట్లాడుతూ తాము ఆవిష్కరించిన విభాగంలో తెలంగాణకు మించిన భాగస్వామి దేశంలో ఎవరూ లేరన్నారు. జిఆర్‌సి టెక్నాలజీ విస్తరణకు కృషి చేస్తామన్నారు.
అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
సెనె్సక్స్ 284, నిఫ్టీ 78 పాయింట్లు పతనం
విదేశీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు
పెట్టుబడులను దెబ్బతీసిన జిఎస్‌టిపై ఉత్కంఠ
ముంబయి, ఆగస్టు 3: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 284.20 పాయింట్లు పతనమై 27,697.51 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 78.05 పాయింట్లు క్షీణించి 8,544.85 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాలతోపాటు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రాజ్యసభలోకి రావడంతో మదుపరులు పెట్టుబడులపై దైలమాలో పడ్డారని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశే్లషించారు. దీంతో వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు తప్పించుకోలేకపోయాయని అన్నారు. కాగా, జపాన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అక్కడి సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన ఉద్దీపనలు నిరాశాజనకంగా ఉండటం కూడా దేశీయ మార్కెట్లను కుంగదీసింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో కూడా ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టపోయాయి. బ్రిటన్ సూచీ మాత్రం లాభపడింది. మరోవైపు బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల దిగువకు చేరడం కూడా మదుపరులలో కొత్త ఆందోళనలకు తెరతీసింది. ఇకపోతే దేశీయ మార్కెట్లలో రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పవర్, ఆటో రంగాల షేర్ల విలువ 2.15 శాతం నుంచి 1.70 శాతం పడిపోయింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 1.50 శాతం, స్మాల్-క్యాప్ 1.14 శాతం చొప్పున క్షీణించాయి.