బిజినెస్

రూ. 140 కోట్ల జరిమానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, ఆగస్టు 5: రిజల్ కమర్షియల్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఆర్‌సిబిసి)పై ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. మునుపె న్నడూ లేనివిధంగా ఏకంగా 21 మిలియన్ డాలర్ల (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 140 కోట్ల రూపాయలు) జరిమానా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ బ్యాంక్ నుంచి హ్యాకర్లు కొట్టేసిన సొమ్ము ఆర్‌సిబిసి ద్వారా బదిలీ కావడమే దీనికి కారణం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఉన్న బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ ఖాతా నుంచి కొందరు గుర్తుతెలియని హ్యాకర్లు దాదాపు 1 బిలియన్ డాలర్ల సొమ్మును కాజేశారు. ఇందులో 81 మిలియన్ డాలర్లు మనీలాలోని ఆర్‌సిబిసిలోగల నాలుగు ఖాతాల్లోకి జమ అయ్యాయి. దీన్ని గుర్తించిన ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంక్.. ఆర్‌సిబిసిపై భారీ జరిమానా వేసింది. ఈ మేరకు శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు ఈ జరిమానాను చెల్లించేందుకు అంగీకరించిన ఆర్‌సిబిసి.. అందుకు ఏడాది వ్యవధిని కోరింది. రెండు విడతల్లో జరిమానాను చెల్లిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ జరిమానా చెల్లింపుతో మనీల్యాండరింగ్, తీవ్రవాదం, సైబర్ నేరాల కట్డడికి తమ బ్యాంక్ కట్టుబడి ఉందన్నది రుజువైంది. బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరతను కాపాడటంలో మేము ముందుంటాం.’ అని తాజా జరిమానాపై ఆర్‌సిబిసి అధ్యక్షుడు, సిఇఒ గిల్ బ్యునవెంతురా స్పందించారు. అయినప్పటికీ అంతకుముందే శుక్రవారం రోజే ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ బ్యాంక్‌ను ఆర్‌సిబిసి కోర్టుకు లాగ గా, తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని, పేమెంట్స్ నెట్‌వర్క్ స్విఫ్ట్‌పై ప్రామాణిక నియమ, నిబంధనలను అనుసరించే ఆ నగదు బదిలీ జరిగిందని ఆర్‌సిబిసి తెలిపింది. దీనిపై బంగ్లాదేశ్ అధికారులు మాట్లాడుతూ ఆర్‌సిబిసిలో నెలకొన్న వ్యవస్థీకృత లోపాల కారణంగానే ఇది జరిగిందని, కొందరు అధికారుల తప్పి దం వల్ల కాదని అన్నారు. ఇక ప్రస్తు తం మనీలాలో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన బృందం ఒకటి ఉండగా, నష్టపోయిన సొమ్మును స్వాధీనం చేసుకునే పనిలో ఇది నిమగ్నమైంది. అయితే ఇప్పటిదాకా కేవ లం 15 మిలియన్ డాలర్లను మాత్రమే బృందం రాబట్టుకోగలిగింది.