బిజినెస్

- ద్రవ్యవిధాన సంస్కరణ - ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాబోయే ఐదేళ్లకుగాను ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నూతన ద్రవ్యవిధాన సంస్కరణలో భాగంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కూడా కొత్తగా నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వడ్డీరేట్ల నిర్ణయానికి సంబంధించి ఏర్పాటైన కమిటీ తీసుకునే విధానపరమైన నిర్ణయాల ఆధారంగా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కేంద్రం.
అదొక్కటే కారణం కాదు: జైట్లీ
దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ ఒక్కటే ప్రధాన కారణం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. డిమాండ్-సరఫరాలో వ్యత్యాసం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తీరుతెన్నులు కూడా కారణాలేనన్నారు. అధిక ద్రవ్యోల్బణానికి కారణం బ్లాక్ మార్కెటింగేనన్నదానిపై శుక్రవారం ఆయన లోక్‌సభలో పైవిధంగా స్పందించారు.

పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
న్యూఢిల్లీ, ఆగస్టు 5: కార్ల ధరలను హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పెంచుతోంది. ఈ నెల 16 నుంచి వివిధ మోడళ్లపై కనిష్టంగా 3,000 రూపాయల నుంచి గరిష్ఠంగా 20,000 రూపాయల వరకు ధరలు పెరుగుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, పెరిగిన ఉత్పాదక వ్యయం ధరల పెంపునకు కారణమని సంస్థ సేల్స్, మార్కెటింగ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాకేశ్ శ్రీవాత్సవ పిటిఐకి తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశీయంగా హ్యుందాయ్ కార్ల ధరలు 3.25 లక్షల నుంచి 31.75 లక్షల రూపాయల వరకు ఉన్నాయి.