బిజినెస్

జిఎస్‌టితో సేవలు ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వస్తే విలాసవంతమైన కార్లు, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెడీమేడ్ దుస్తుల ధరలు తగ్గుతాయి. అయితే అధిక పన్ను వలన మొబైల్ ఫోన్లు, బ్యాంకింగ్, బీమా సేవలు, టెలిఫోన్ బిల్లులు, విమానయాన చార్జీలు పెరుగుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని భావిస్తున్న ఈ కొత్త పరోక్ష పన్నుల చట్టం వలన తయారీ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ సేవల పన్ను రూపంలో మరింత భారం పడుతుంది గనుక వినియోగదారులు మరింత వ్యయం చేయకపోవచ్చు. జిఎస్‌టి ప్రధానంగా వినిమయ ఆధారిత పన్ను కావడమే ఇందుకు కారణం. వస్తు, సేవల పన్ను ద్వారా ఒనగూడే ప్రయోజనాలను సామాన్య ప్రజలకు చేరవేస్తామని, అయితే జిఎస్‌టి వలన ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో, ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ‘మొత్తంగా చూస్తే జిఎస్‌టి వలన సామాన్య ప్రజలపై పన్ను భారం తగ్గుతుంది. కానీ పన్ను రేటు ఎంతన్నదీ ఖరారు కాకముందే జిఎస్‌టి వలన ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో అంచనా వేయడం అసాధ్యం’ అని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న ‘పన్నుపై పన్ను’ పద్ధతి సామాన్యులకు పెను భారంగా పరిణమించిన విషయం తెలిసిందే. ఉదాహరణకు వస్తువుల ఉత్పత్తి వ్యయంపై ప్రభుత్వం కేవలం వ్యాట్ (విలువ జోడించిన పన్ను)తో సరిపెట్టకుండా ఫ్యాక్టరీ గేట్ వద్దనే ఎక్సైజ్ సుంకంపై కూడా పన్ను విధిస్తుండటం ఆయా వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. అయితే జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత ‘పన్ను మీద పన్ను’ పోటు నుంచి ప్రజలకు విముక్తి లభించడంతో పాటు ఎఫ్‌ఎంసిజి మొదలుకొని గృహోపకరణాల వరకు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తులు మొదలుకొని రెడీమేడ్ దుస్తుల వరకు పలు వస్తువుల ధరలు తగ్గడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు జిఎస్‌టి ప్రభావం వలన పన్ను రేటు తక్కువగా ఉన్న చిన్న కార్ల (ఎక్సైజ్ సుంకం 8 శాతం) లాంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. అయితే ఎక్సైజ్ సుంకం 27 నుంచి 30 శాతం వరకు ఉన్న పెద్ద కార్లు, ఎస్‌యువిల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న పన్ను రేటు 18 నుంచి 22 శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నందున పన్ను నుంచి మినహాయించిన అంబులెన్స్ సేవలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు తప్ప మిగిలిన అన్ని ప్రధాన సేవలు వ్యయభరితంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుక జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత హోటళ్లలో భోజనం, ప్రయాణం, టెలిఫోన్ బిల్లులు, బ్యాంకింగ్, బీమా సేవలు, అద్దె కార్లు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, సినిమాలు, బ్రాండెడ్ ఆభరణాలు, ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ లాంటి ప్రముఖ క్రీడా ఈవెంట్లు వ్యయభరితంగా మారడం ఖాయమని స్పష్టమవుతోంది.