బిజినెస్

ఆర్‌బిఐ విధానమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యపరపతి విధానం సమావేశం, కార్పొరేట్ సంస్థల చివరి దశ త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు వచ్చే వారం మార్కెట్ ధోరణిని నిర్ణయిస్తాయని నిపుణులు అంటున్నారు. వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించే అవకాశముందని వారన్నారు. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం, తొలి త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయిస్తాయి. ‘మంగళవారం జరిగే ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం మూడవ ద్వైమాసిక సమీక్ష ఈ వారంలో జరిగే తదుపరి ప్రధాన సంఘటనగా ఉంటుంది’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయ పడ్డారు. ఆర్‌బిఐ పాలసీ కాకుండా జూన్‌తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు, రుతుపవనాల పురోగతి, స్థూల ఆర్థిక గణాంకాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. ఈ వారంతో దేశీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ దాదాపు ముగుస్తుంది. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న కీలక సంస్థల్లో హీరో మోటోకార్ప్, ఐడియా సెల్యులార్, అదానీ పోర్ట్స్, లుపిన్ స్పెషల్ ఎకనామిక్ జోన్, మహింద్ర, మహింద్ర, హిందాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాగా, శుక్రవారం ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రకటించనుంది. అదే రోజు వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా వెలువడుతాయని సింఘానియా చెప్పారు. ‘వచ్చేవారానికి అత్యంత ముఖ్యమైన సంఘటన ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం ప్రకటన’ అని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ విభాగం చీఫ్ పంకజ్ శర్మ అభిప్రాయ పడ్డారు. గత వారం సెనె్సక్స్ 26.49 పాయింట్లు, నిఫ్టీ 44.65 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే.
ఈ వారం మార్కెట్ కదలిక త్రైమాసిక ఫలితాల ప్రకటనపై ఆధారపడి ఉంటుంది, దీనితో పాటుగా విదేశీ పోర్ట్ఫులియో మదుపరుల కార్యకలాపాలు కూడా కీలకమే. మంగళవారం ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం, అలాగే శుక్రవారం వెలువడనున్న పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణంలాంటి గణాంకాలను కూడా మదుపరులు జాగ్రత్తగా గమనించే అవకాశముంది’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సిఈఓ రోహిత్ గాడియా అభిప్రాయ పడ్డారు.