బిజినెస్

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, ఆగస్టు 9: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎపిఐఐసి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ప్రకాశం, బొబ్బిలి, హిందూపురంలో ఎపిఐఐసి ఆధ్వర్యంలో గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపా రు. పరిశ్రమల ఏర్పాటుకు గ్రోత్ సెంటర్‌లో అనుకూలమైన వాతావరణం కల్పించడంతోపాటు పలు రకాల రాయితీలు ఇస్తున్నట్టు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గ్రోత్ సెంటర్లలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరం అనుకుంటే 3 నుంచి 400 ఎకరాలు కేటాయించేందుకు అవకాశం ఉందన్నారు. పెద్ద పరిశ్రమలకు అనుసంధానంగా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కర్నూలులో 400 ఎకరాల్లో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరులో విండ్ పవర్ పరిశ్రమ 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని, విశాఖపట్టణంలో ఎషియన్ పెయింట్స్‌కు సంబంధించిన పెద్ద పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. విశాఖపట్టణం, నెల్లూరులో రెండు ఫార్మా క్లస్టర్లను 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. విశాఖపట్టణంలోనే పెప్సీ, కోకాకోలా బాటిల్ తయారీ కంపెనీ ఒకటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారన్నారు. సమావేశంలో గ్రోత్ సెంటర్ జెడ్‌ఎం యతిరాజు తదితరులు పాల్గొన్నారు.