బిజినెస్

లుపిన్ లాభం రూ. 882 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఔషధరంగ దిగ్గజం లుపిన్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 55.12 శాతం పెరిగి 881.95 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 568.55 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు కూడా 40.01 శాతం ఎగిసి ఈసారి 4,313.56 కోట్ల రూపాయలుగా, గతంలో 3,080.87 కోట్ల రూపాయలుగా ఉన్నాయని లుపిన్ మంగళవారం తెలిపింది.

అదానీ లాభం రూ. 836 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్) ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నిరుడుతో పోల్చితే 31 శాతం పెరిగి 835.71 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 638.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈసారి 7 శాతం వృద్ధి చెంది 1,826.58 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 1,714.78 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం సంస్థ స్పష్టం చేసింది.

వ్యాపార విస్తరణ దిశగా సింక్రోని ఫైనాన్షియల్

హైదరాబాద్, ఆగస్టు 9: సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల విస్తరణ దిశగా ముందుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోగల నాలెడ్జ్ సిటీలో 2 లక్షల చదరపు అడగులకుపైగా విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ లీజ్ అగ్రిమెంట్‌పై సంస్థ సంతకాలు చేసింది. ఇప్పటికే నగరంలోని ఐల్యాబ్స్‌లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.