బిజినెస్

జిఎస్‌టి అమలు ఎప్పుడో ఊహించడం కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పరోక్ష పన్ను సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలు ఎప్పటినుంచి జరుగుతుందో చెప్పడం కష్టమని, ఎందుకంటే ఇది ప్రధానంగా చట్టసభ ప్రక్రియపై అధారపడి ఉండడమే దీనికి కారణమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఇది ప్రధానంగా చట్టసభల క్యాలెండర్‌పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల జిఎస్‌టి బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెడతారు? రాష్ట్ర శాసన సభలు తాము చేయాల్సిన పనిని ఎప్పుడు చేస్తాయి? అనేది అదంతా జరిగే దాకా ఇప్పుడు ఊహించడం కష్టమని ఆయన బుధవారం ఇక్కడ అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి జిఎస్‌టి అమలవుతుందని ప్రభుత్వం ఆశతో ఉండింది. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో చర్చకు రాకపోవడంతో అక్కడే ఆగిపోయింది. ఒక వేళ ఈ బిల్లు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందినప్పటికీ జిఎస్‌టి అమలుకు సవరించిన గడువుఎప్పుడనేది చెప్పలేమని సిన్హా అన్నారు. జిఎస్‌టి రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో దాన్ని ఆమోదించడంతో పాటు 50 శాతం రాష్ట్రాల శాసన సభలు సైతం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరాశ కలించాయని, ఎందుకంటే జిఎస్‌టి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రభుత్వం భావించిందని మంత్రి చెప్పారు.