బిజినెస్

మాల్యాపై మరో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రుణపీడిత విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ.. తాజాగా మరో కేసును నమోదు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నుంచి తీసుకున్న 1,600 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో మాల్యా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎస్‌బిఐ నుంచి అందిన ఫిర్యాదు అనంతరం మాల్యాతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశామని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట మాల్యా 6,900 కోట్ల రూపాయల రుణాన్ని పొందగా, అవి ఎంతకీ చెల్లించకపోవడంతో వడ్డీలు, వడ్డీలపై వడ్డీలతో ఇప్పుడు ఆ రుణ భారం 9,000 కోట్ల రూపాయలకుపైగా చేరింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానయాన సేవలకు దూరమవగా, మరోవైపు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రతో మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో విఫలమయ్యారన్న కేసును మాల్యాపై సిబిఐ నమోదు చేసింది. దీని దర్యాప్తు నడుస్తున్న క్రమంలోనే ఎస్‌బిఐ ఫిర్యాదుతో మరో కేసును సిబిఐ దాఖలు చేసింది. ఐడిబిఐ బ్యాంక్‌కు మాల్యా 900 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడ్డాడు. కాగా, ఎస్‌బిఐ, ఐడిబిఐతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో 800 కోట్ల రూపాయలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకోగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 650 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 550 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 410 కోట్లు), యూకో బ్యాంక్ (రూ. 320 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ. 310 కోట్లు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (రూ. 150 కోట్లు), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (రూ. 140 కోట్లు), ఫెడరల్ బ్యాంక్ (రూ. 90 కోట్లు), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (రూ. 60 కోట్లు), యాక్సిస్ బ్యాంక్ (రూ. 50 కోట్లు)ల నుంచీ రుణాలు తీసుకుంది. అయితే మాల్యా సారథ్యంలోని యుబి గ్రూప్ షేర్ల అమ్మకాల ద్వారా 1,100 కోట్ల రూపాయలను బ్యాంకులు దక్కించుకోగలిగాయి. మిగతా రుణాల వసూళ్ల కోసం బ్యాంకులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. రుణాల మంజూరు సమయంలో తాకట్టు పెట్టిన స్తిర, చరాస్తుల వేలానికి స్పందన శూన్యం. మరోవైపు ఈ వ్యవహారం కోర్టులదాకా వెళ్లగా, ఎన్ని ఆదేశాలు జారీ చేసినా, మరెన్నీ నాన్ బెయిలబుల్ వారెంట్లున్నా.. లండన్‌లో ఉన్న మాల్యా మాత్రం భారత్‌కు తిరిగి రావడం లేదు.