బిజినెస్

క్షేత్ర స్థాయి సంస్కరణలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, ఆగస్టు 14: వ్యాపార నిర్వహణ సులభతరం కావాలంటే క్షేత్ర స్థాయిల్లోనూ సంస్కరణలు అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆదివారం దుర్గ్ జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన సెమినార్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ పురపాలక, పంచాయతీలను కూడా సంస్కరించాలని అన్నారు. స్థానిక పరిపాలనా సంస్థల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార నిర్వహణ సులభతరం కోసం తీసుకునే చర్యలు సత్ఫలితాలనిస్తాయన్నారు. పర్యావరణ అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదాలు, ఇతరత్రా అనుమతుల ద్వారానే పెట్టుబడులు వస్తాయని, అయితే ఒకవేళ మున్సిపాలిటీ, పంచాయతీల వంటి స్థానిక సంస్థల నుంచి ఆమోదం లేకుంటే ఈ ప్రక్రియ మొత్తం వృథానే అయిపోతుందని వ్యాఖ్యానించారు. కాబట్టి క్షేత్ర స్థాయిల్లోనూ సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పారదర్శక పరిపాలనను తీసుకురావాల్సి ఉందని అన్నా రు. నిజానికి అంతర్జాతీయ ఆర్థిక విప్లవాలు భారత్‌కు లాభించలేదని, అయినప్పటికీ నేటి ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకెళ్తోందని చెప్పారు.