బిజినెస్

అరబిందో వ్యాక్సిన్ల తయారీ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ఔషధరంగ సంస్థ అరబిందో ఫార్మా.. ఓ వ్యాక్సిన్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఏటా 50 మిలియన్ మోతాదులతో తయారయ్యే ఈ వ్యాక్సిన్ల ప్లాంట్.. 2018 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది.
వ్యాక్సిన్ల తయారీ విభాగంపై తమకు అమితాసక్తి ఉందని, ఈ రంగంలో పోటీ తక్కువగా ఉంటుందని అరబిందో ఫార్మా తమ వార్షిక నివేదికలో తెలియజేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన టెర్గెనె బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అరబిందో ఫార్మా ఓ జాయింట్ వెంచర్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ వెంచర్‌లో అరబిందో ఫార్మాకే అధిక వాటా ఉంటుంది. టెర్గెనె బయోటెక్.. పిసివి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పిసివి విక్రయాలు జరుగుతుండగా, ఈ మార్కెట్ విలువ 6 బిలియన్ డాలర్లకుపైగా ఉంది.