బిజినెస్

మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ నష్టాలపాలయ్యాయి. గురువారం లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరుల అమ్మకాల మధ్య మరోసారి నష్టాలు తప్పలేదు. ఐరోపా మార్కెట్లు పతనం కావడం, ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ స్పందనలు రావడం వంటివి దేశీయ సూచీలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 46.44 పాయింట్లు పడిపోయి 28,026.12 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.35 పాయింట్లు కోల్పోయి 8,666.90 వద్ద నిలిచింది. గురువారం సెనె్సక్స్ 118 పాయింట్లు, నిఫ్టీ 49 పాయింట్లు పెరిగినది తెలిసిందే. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 75.40 పాయింట్లు, నిఫ్టీ 5.25 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నడవని మార్కెట్లు.. మంగళ, బుధవారాల్లో నష్టాలకే పరిమితమయ్యాయి. కాగా, శుక్రవారం ట్రేడింగ్‌లో కోల్ ఇండియా, టిసిఎస్, లుపిన్, విప్రో, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, గెయిల్, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి షేర్లు నష్టపోయాయి. ఎస్‌బిఐ, టాటా స్టీల్, సిప్లా, హెచ్‌యుఎల్, ఎల్‌అండ్‌టి, ఒఎన్‌జిసి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బిఐ షేర్ విలువ 4.15 శాతం ఎగిసి 258.50 రూపాయలకు పెరిగింది. అలాగే ఎస్‌బిఐలో విలీనమవుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ షేర్ విలువ 6.06 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ షేర్ విలువ 1.23 శాతం పెరిగింది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేర్ విలువ మాత్రం 11.21 శాతం దిగజారింది. దీని విలీనంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతలే ఇందుకు కారణం. ఇక రంగాలవారీగా రియల్టీ, టెక్నాలజీ, ఆటో, ఐటి, హెల్త్‌కేర్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
అంతర్జాతీ యంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ 0.37 శాతం నష్టపోతే, జపాన్ 0.36 శాతం, సింగపూర్ 0.25 శాతం, చైనా సూచీ 0.13 శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.87 శాతం వరకు దిగజారాయి.