బిజినెస్

వృద్ధి రేటు 8 శాతంపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 23: వరసగా రెండో త్రైమాసికంలో సైతం జిడిపి గణాంకాలు మెరుగుపడ్డంపై సంతోషం వ్యక్తం చేసిన నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియ ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతానికి పైగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో జిడిపి వృద్ధి 7.2 శాతంగా ఉండగా, ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఇది 8 శాతాన్ని దాటవచ్చని భావిస్తున్నట్లు పనగరియ చెప్పారు. ఉత్పాదక రంగం తిరిగి పుంజుకోవడంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జిడిపి 7.4 శాతం వృద్ధి చెందిన విషయం తెలిసిందే. దీంతో మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక శక్తిగా నిలిచింది. సింగపూర్, దక్షిణ కొరియా,తైవాన్, చైనా నాలుగు దేశాలు మాత్రమే 8నుంచి 10 శాతం వృద్ధి రేటును కలిగి ఉన్నాయని పనగరియ బుధవారం ఇక్కడ మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటి) విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. అయితే వ్యవసాయం లాంటి కొన్ని రంగాల్లో వృద్ధి రేటు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసారు.