బిజినెస్

వేలానికి మరోసారి మాల్యా జెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: సేవా పన్ను శాఖ మరోసారి లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ప్రైవేట్ జెట్‌ను వేలం వేసే అవకాశాలున్నాయి.
152 కోట్ల రూపాయల రిజర్వ్ ధరతో గురువారం నిర్వహించిన వేలంలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఫలితంగా ముచ్చటగా మూడోసారి వేలానికి వెళ్ళాలని సేవా పన్ను శాఖ భావిస్తోంది. తాజా వేలంలో గరిష్ఠంగా 27 కోట్ల రూపాయల బిడ్ దాఖలైంది. ఎస్‌జిఐ కమ్మెక్స్ అనే దేశీయ సంస్థ నుంచి ఈ ఆఫర్ వచ్చింది.
దీంతో మళ్లీ తమ అధికారిక వేలందారు ఎమ్‌ఎస్‌టిసి ద్వారా బిడ్లకు ఆహ్వనం పలకాలని యోచిస్తున్నట్లు సేవా పన్ను శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గతంలో జూన్ 30న నిర్వహించిన వేలంలో యుఎఇకి చెందిన విమానయానరంగ సంస్థ అల్నా ఏరో డిస్ట్రిబ్యూషనల్ ఫైనాన్స్ హోల్డింగ్స్ 1.09 కోట్ల రూపాయలకే ఈ విమానాన్ని అడిగినది తెలిసిందే.
మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 800 కోట్ల రూపాయల పన్ను బకాయిలను వసూలు చేసుకోవడంలో భాగంగా 2013 డిసెంబర్‌లో సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మాల్యా జెట్‌ను అటాచ్ చేసింది.