బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్‌కు ‘మిషన్ భగీరథ’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగరీథ పథకం పనులు బిఎస్‌ఎన్‌ఎల్ పాలిట శాపంగా పరిణమిస్తున్నాయ. భగీరథ పైపులైన్ల నిర్మాణం కోసం జెసిబిలతో తవ్వుతున్న కాలువల వల్ల బిఎస్‌ఎన్‌ఎల్ కేబుల్స్ ఎక్కడికక్కడే ముక్కల వుతున్నాయి. దీంతో బిఎస్‌ఎన్‌ఎల్‌కు కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టమే కాకుండా, సేవలు నిలిచిపోయ ఆదాయ నష్టం కూడా వాటిల్లుతోంది. మెదక్ జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ పనులు వేగవంతంగా కొనసాగుతుండగా, టెలీకమ్యూనికేషన్ సేవలకూ అంతే స్థాయలో ఆటంకం ఏర్పడు తోంది. ప్రధానంగా బిఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ నష్టాన్ని మిగుల్చుతున్నాయ. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలన్నీ కూడా బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్లను, దానిద్వారా వచ్చే బ్రాడ్‌బాండ్‌నే పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయ మరి. భగీరథ పనుల్లో భాగంగా జెసిబి యంత్రాల తవ్వకాల్లో కేబుల్స్ తెగిపోయ ల్యాండ్‌లైన్ ఫోన్లకు, బ్రాడ్‌బాండ్ సేవలకు విఘాతం కలుగుతోంది. దీంతో వినియోగదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక చోట కేబుల్ తెగిపోయిందంటే దాన్ని అతికించడానికి గంటల తరబడి నిపుణులు శ్రమించాల్సి వస్తోంది. అలాం టిది అనేక చోట్ల కేబుల్ తెగిపోతుండటంతో బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. ఒక్క సిద్దిపేట పట్టణంలోనే వంద కోట్ల విలువైన కేబుల్‌ను అండర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. అయతే సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌లో మిషన్ భగీరథ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతుండటంతో తవ్వకాల్లో కేబుల్స్ పాడైపో తున్నాయ. వాస్తవా నికి పనులు నిర్వహిస్తున్నామని కేబుల్‌ను మార్చుకోవాలంటూ లిఖితపూర్వకంగా బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు భగీరథ పథకం అధికారులు సూచించినా.. అది అంత తేలిగ్గా జరిగే పనికాదని బిఎస్‌ఎన్‌ఎల్ అంటోంది. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కేబుల్ తెగిపోతే అందుకు అవసరమైన పరిహారం చెల్లించాలన్న నిబంధనలను సైతం పట్టించుకోవడం లేదని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు అంటున్నారు. కాగా, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలకు మంజీర నీటిని అందించడానికి ఈ మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కేబుళ్లు తెగిపోవడంతో గంటల తరబడి బిఎస్‌ఎన్‌ఎల్ ఫోన్లు పని చేయకపోవడం, బ్రాడ్‌బాండ్ సరఫరా నిలిచిపోవడంతో వ్యాపార, కార్యాలయ పనులు స్తంభించిపోతున్నాయని, ప్రభుత్వరం గ సంస్థల అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. ఇక గృహ వసరాల్లో కలిగే ఇబ్బందులైతే చెప్పనక్కర్లేదు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంటింటికి మంచినీటిని అందించడానికి పైపులైన్ల నిర్మాణం పనులు కొనసాగడం ఖాయమని చెప్పవచ్చు. అయ తే కేబుల్ ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా ఇతర ప్రాంతంలో పైపులైన్ నిర్మిస్తే బాగుంటుందని, లేనిపక్షంలో బిఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టెలికామ్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థలైన ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్, వొడాఫోన్, టెలినార్ తదితర అనేక సంస్థలకు చెందిన కేబుళ్లనూ మిషన్ భగీరథ యంత్రాలు ధ్వంసం చేస్తున్నాయి. ఏ ఒక్క సంస్థకు కూడా పరిహారం చెల్లించకపోవడంతో కోట్లా ది రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. మొత్తానికి నష్టం మాట అటుంచితే ఫోన్లు, బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్లపై ఆధారపడినవారికి నరకం కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నెట్‌వర్కింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూసి వినియోగదారులకు మేలు చేకూర్చాల్సిన అవసం ఎంతైనా ఉంది.

మిషన్ భగరీథ పనుల్లో భాగంగా జెసిబి తవ్వకాలు