బిజినెస్

నిలకడగా ఎఫ్‌పిఐ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: విదేశీ మదుపరులు ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 7,700 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొ చ్చారు. దేశ, విదేశీ అనుకూల సంకేతాలు, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం వంటివి భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను రప్పించాయ. 2009 నుంచి గమనిస్తే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తొలిసారిగా కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడం కూడా కలిసొచ్చింది. దీంతో ఆగస్టు 1-19 మధ్య స్టాక్ మార్కెట్లలోకి 7,723 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 1,699 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. ఫలితంగా భారతీయ మార్కెట్లలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 6,023 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, గత నెల జూలైలో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు గడచిన నాలుగు నెలల్లో అత్యధికంగా నిలిచాయ. 12,612 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయ. మార్చి నెలలో 21,143 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ జూలైలోనే ఎక్కువగా రావడం జరిగింది. మరోవైపు రుణ మార్కెట్లలోకి కూడా 6,845 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు జూలైలో పట్టుకొచ్చారు. దీంతో మొత్తం అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి 19,457 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు (2.89 బిలియన్ డాలర్లు) జూలైలో వచ్చినట్లైంది. నిజానికి జూన్ వరకు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ లేదా ఎఫ్‌ఐఐ) ఆసక్తి కనబరిచారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న (బ్రెగ్జిట్) భయాలు విదేశీ మదుపరులను రుణ మార్కెట్ల వైపు చూడనివ్వలేదు. బ్రెగ్జిట్‌కే బ్రిటనీయులు మద్దతు పలకడంతో మరింత దూరమయ్యారు. అయతే జూలై మొదలు స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోనూ పెట్టుబడులకు మొగ్గు చూపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను సరళతరం చేయడం, నూతన ఖనిజ అనే్వషణ విధానాన్ని ఆమోదించడం, షాపింగ్ సముదాయాలు, సినిమా హాల్స్‌ను 24 గంటలు తెరిచేందుకు అంగీకరించడం వంటి నిర్ణయాలు విదేశీ మదుపరులను ఆకట్టుకున్నాయ. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబ డులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. అంతకు ముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి- జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసు కున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 39,501 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. రుణ మార్కెట్ల నుంచి 6,422 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 33,079 కోట్ల రూపాయలుగా నమోదైంది.