బిజినెస్

‘ఆస్క్‌మి’ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థ ఆస్క్‌మి.. తమ వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. దీంతో 4,000 మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. మరోవైపు ఆస్క్‌మిలో మెజారిటీ మదుపరి అయిన ఆస్ట్రో.. ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిపిస్తామని, ఆర్థిక లావాదేవీలను సమీక్షిస్తామని తెలిపింది. గెటిట్‌కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన్ ఆస్క్‌మి.. ఆస్క్‌మి డాట్‌కామ్ (క్లాసిఫైడ్స్), ఆస్క్‌మిబజార్ (ఈ-కామర్స్), ఆస్క్‌మిగ్రాసరీ, ఆస్క్‌మిపే, మెబెల్‌కార్ట్ (ఆన్‌లైన్ ఫర్నీచర్ రిటైల్)లను నిర్వహిస్తోంది. కాగా, గెటిట్, ఆస్ట్రోల మధ్య ఆస్క్‌మిపై తీవ్ర విబేధాలే కనిపిస్తున్నాయి. ఆస్ట్రో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై ఆస్క్‌మి స్పందిస్తూ ఎలాంటి అవకతవకలు బయటపడినా అందుకు బాధ్యత ఆస్ట్రోదేనని తెలిపింది. గతంలో ఆడిట్ చేసిన కమిటీలో ఉన్న ముగ్గురు సభ్యులూ ఆస్ట్రో నామినెట్ చేసినవారేనని గుర్తుచేసింది. మొత్తానికి ఆస్క్‌మి షట్‌డౌన్‌తో 4,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు.