బిజినెస్

ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమల మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 23: మెదక్ జిల్లాలోని మెదక్, నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ పరిశ్రమలను లే ఆఫ్ చేస్తున్నట్లు మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ ప్రధాన గేటుకు బుధవారం నోటీసు అంటించారు. దీంతో కార్మికులు నివ్వెరబోయారు. దాంతో 51 శాతం ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమలో వాటా ఉన్న గోకరాజు గంగరాజు దిష్టిబొమ్మకు ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ నుంచి మంబోజిపల్లి చౌరస్తా వరకు కార్మికులు శవయాత్ర నిర్వహించారు. మంబోజిపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మ మెడకు ఉరివేసి, చెప్పులతో కొట్టి, ఆ తరువాత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
కార్మికులను ఆదుకోవాలి : ఐఎన్‌టియుసి
చెరకు రైతులను 20 కోట్లు విడుదల చేసి ఆదుకున్నట్లుగా మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ కార్మికులకు రూ.5 కోట్లు రిలీజ్ చేసి ఆదుకోవాలని ఐఎన్‌టియుసి సెక్రటరీ పల్లె సిద్దిరాములుగౌడ్ డిమాండ్ చేశారు. డెల్టా పేపర్స్ మిల్స్ విషయం తేలేంత వరకు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్‌డిఎస్‌ఎల్‌లో 51 శాతం వాటా ఉన్న బోర్డ్డ్ఫా డైరెక్టర్లు గంగరాజు, రంగరాజు, రామరాజు, 49 శాతం వాటా ఉన్న పరిశ్రమల సెక్రటరీ అరవింద్‌కుమార్, కేన్ కమిషన్ బద్రు మలోత్ ఈ నెల 18న సమావేశం ఏర్పాటు చేసుకొని లే ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు సిద్దిరాములుగౌడ్ తెలిపారు. వీరి నిర్ణయం మేరకే బుధవారం లే ఆఫ్ నోటీసు బోర్డును ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల మెట్‌పల్ల్లి, బోధన్, మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 300 కుటుం బాలు రోడ్డున పడ్డాయన్నారు. బుధవారం మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ కార్మికులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో యూనియన్ నాయకులు అల్లం ప్రభాకర్, ముక్తార్ అహ్మద్, బాబురెడ్డి, నరేందర్, కృష్ణ, నర్సింహ్మారెడ్డి, అంజాగౌడ్, ఎల్లయ్యస్వామి, అంజయ్య, బాలపోచయ్య తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌లో ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమను మూసివేసిన దృశ్యం, గంగరాజు దిష్టిబొమ్మ వద్ద విలపిస్తున్న కార్మికులు