బిజినెస్

ఉర్జిత్ పటేల్‌పై నమ్మకముంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 26: ద్రవ్యోల్బణంపై పోరును ఉర్జిత్ పటేల్ కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యక్తం చేశారు. వచ్చే నెల 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుండగా, ఆ స్థానంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బిఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నది తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఇక్కడ జరిగిన ఫారెక్స్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫెడాయ్) కార్యక్రమంలో పాల్గొన్న రాజన్ మాట్లాడుతూ ‘గత మూడేళ్లుగా ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ హోదాలో నాతో కలిసి పనిచేసిన ఉర్జిత్ పటేల్.. ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచగలరన్న నమ్మకం నాకుంది. ఆర్‌బిఐ గవర్నర్ హోదాలో ఆయన నూతన ద్రవ్య విధాన కమిటీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలరని కూడా భావిస్తున్నాను.’ అని అన్నారు. 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్‌బిఐ లక్ష్యం.

సెబీకి రూ. 300 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ
సుప్రీంలో సహారా చీఫ్ సుబ్రతా రాయ్

న్యూఢిల్లీ, ఆగస్టు 26: మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి అదనంగా 300 కోట్ల రూపాయలను చెల్లిస్తామని సహారా చీఫ్ సుబ్రతా రాయ్.. శుక్రవారం సుప్రీం కోర్టులో తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీగా అందిస్తామన్నారు. కాగా, చీఫ్ జస్టిస్ టిఎస్ థాకూర్ నేతృత్వంలో జస్టిస్ ఎఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచుద్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ అంశాన్ని వచ్చే వారం పరిశీలిస్తామని చెప్పింది. రాయ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదించారు. ఈ నెల 3న రాయ్ పరోల్ గడువును వచ్చే నెల 16దాకా అత్యున్నత న్యాయస్థానం పొడిగించడం తెలిసిందే. సెబీకి 300 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలన్న షరతుపైనే గడువును పెంచింది. ఈ క్రమంలోనే ఆ డిపాజిట్‌ను బ్యాంక్ గ్యారెంటీగా సమర్పిస్తానని రాయ్ అన్నారు.