బిజినెస్

గోదావరి సోయగానికి పర్యాటక సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 26: ఆకుపచ్చని తివాచీ కప్పుకుని అణువణువూ ప్రకృతి సోయగాన్ని నింపుకున్న ప్రాంతమే తూర్పు వాకిలి. జీవ వైవిధ్యమే కాదు భౌగోళిక వైవిధ్యం కూడా ఈ ప్రాంత ప్రత్యేకత. గోదావరి గలగలల నడుమ పాపికొండల అందాలు ఈ ప్రాంతానికి తలమానికం. పంట పొలాలు.. పిల్ల కాలువలు.. గోదావరి ఇసుక తినె్నలు ఇక్కడికి రారమ్మని పర్యాటకులను నిత్యం ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి. ఈ ప్రాంత ప్రకృతి రమణీయత వెలుగు జిలుగుల వెండి తెరపైనా రీళ్ల కొద్దీ కనువిందు చేశాయి... చేస్తూనే ఉంటాయి. అందుకే పర్యాటక పటంలో తూర్పు గోదావరి జిల్లాకు శాశ్వత స్థానం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేసింది. ఈ ఆలోచనలోంచి పుట్టిందే అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు. గోదావరి నదీ విహారం అంటేనే పర్యాటకులతోపాటు, ప్రకృతి ప్రేమికులు ఎగిరి గంతేస్తుంటారు. ఎన్నిసార్లు ఆ ప్రకృతి రమణీయతను వీక్షించినా, ఇంకా ఏవో అందాలు చూడలేకపోయామన్న భావన కలుగుతుంది. అయతే ఏటా తూర్పు తీరంలోని గోదావరి నదీ అందాలు చూసేందుకు తరలివస్తున్న లక్షలాది పర్యాటకులకు లంకల్లో ఆతిథ్యమివ్వడానికి సర్కారు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజిని ఆనుకుని ఉన్న గోదావరి లంకల్లో పర్యాటకుల విడిదికి సకల సౌకర్యాలు కల్పించాలని ప్రణాళికలు రూపొందించారు. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శంకుస్థాపన చేసిన రాజమహేంద్రవరం సమీపంలోని పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుకు మళ్ళీ ప్రాణం పోశారు. అప్పట్లో తెలుగు చిత్ర సీమ హైదరాబాద్‌లో నిలదొక్కుకుంటున్న క్రమంలో ఔట్‌డోర్ షూటింగ్‌లకు పిచ్చుకలంక ప్రాంతం అనువుగా ఉందని, గోదావరి నది అందాల నడుమ లంకలు వెండితెరకు వనె్నతెస్తాయని కొందరు సినీ దర్శక, నిర్మాతలు సూచించడంతో ఎన్టీఆర్ ఆనాడు స్వయంగా పిచ్చుకలంకను చూసి, పర్యాటక ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. ఆ పరంపరలోనే మూవీ మొఘల్ దివంగత డాక్టర్ రామానాయుడు పిచ్చుకలంకలో షూటింగ్‌లకు అనుకూలంగా స్టూడియో నిర్మాణానికి ముందుకు వచ్చారు. అయితే కాలక్రమేణా ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ఇపుడు మళ్ళీ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో జీవం పోసుకుంది. పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని పిచ్చుకలంక ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. రిసార్టులు, రెస్టారెంట్లు, బోట్ షికారు, హెలీప్యాడ్ స్టేషన్, వాటర్ గేమ్స్ వంటి సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఏజెన్సీలకు పిచ్చుకలంకను అప్పగించారు. ఎపి టూరిజంకు జల వనరుల శాఖ భూమిని అప్పగించడంతో అంతర్జాతీయ పర్యాటక సంస్థలకు భూములనిస్తున్నారు. నది మధ్య లంకలో బోట్ షికారు, విహంగ వీక్షణం చేయడానికి హెలికాఫ్టర్లను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు రెండు హెలీ ప్యాడ్‌లను నిర్మిస్తున్నారు. భారీ జెట్టీ, హెలీ ప్యాడ్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు. గోదావరి నది మధ్యలో పిచ్చుకలంక 70 ఎకరాల మేర విశాలంగా ఉంటుంది. ఈ లంకను ఆనుకుని బొబ్బర్లంకలో మరో 30 ఎకరాల గోదావరి లంక ఉంది. మొత్తం ఈ 100 ఎకరాల గోదావరి లంకను అనుసంధానం చేస్తూ వాటర్ పార్క్, కాటేజీలు, వాటర్ విలేజ్‌ను పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) ఆధారంగా ఒక్కొక్కటిగా ప్యాకేజీలుగా పనులను ఆరంభించనున్నారు. టెండర్లు పిలిచి భూములను అప్పగిస్తున్నారు. సినీ షూటింగ్‌లకు అనుకూలంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టారు. మరోపక్క పూల వనాలకు ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలను అనుసంధానం చేస్తూ, పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దేశంలోనే పేరెన్నికగన్న పర్యాటక ప్రాజెక్టుగా పిచ్చుకలంకను తీర్చిదిద్దుతున్నారు. ఇటు కోనసీమ, అటు మడ అడవులు, కోరంగి అభయారణ్యం, ప్రసిద్ధ దేవాలయాలు, అటవీ ప్రాంతాలను ఒక సర్క్యూట్‌గా అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.