బిజినెస్

ఏడాది గరిష్ఠానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 31: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లోనే ముగిశాయి. సోమ, మంగళవారాల్లో నమోదైన లాభాలను బుధవారం కూడా సూచీలు కొనసాగించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 109.16 పాయింట్లు పుంజుకుని 13 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 28,452.17 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 41.85 పాయింట్లు అందుకుని 16 నెలల గరిష్ఠాన్ని చేరి 8,786.20 వద్ద స్థిరపడింది. కాగా, ఆగస్టు నెలలో సెనె్సక్స్ 401.31 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ 147.70 పాయింట్లు ఎగిసింది. సూచీలు ఇలా లాభాలను అందుకోవడం వరుసగా ఇది 6వ నెల కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి నుంచి స్టాక్ మార్కెట్లు నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. 2014 నవంబర్ నుంచి గమనిస్తే ఇన్ని నెలలు వరుసగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచిన దాఖలాలు లేవు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మొదలు ఇప్పటిదాకా (ఏప్రిల్-ఆగస్టు) సెనె్సక్స్ 3,110.31 పాయింట్లు ఎగబాకింది. ఇకపోతే బుధవారం ట్రేడింగ్‌లో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆయా రంగాల షేర్లు 1.40 శాతం నుంచి 0.15 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే మెటల్, రియల్టీ రంగాల షేర్లు మాత్రం 1.40 శాతం, 0.81 శాతం మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ 0.97 శాతం పెరిగితే, చైనా 0.35 శాతం వృద్ధి చెందింది. హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు మాత్రం 0.18 శాతం వరకు కోల్పోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్ 0.40 శాతం లాభపడితే, జర్మనీ 0.22 శాతం, బ్రిటన్ 0.11 శాతం పడిపోయాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య మంగళవారం ఒక్కరోజే సెనె్సక్స్ 440 పాయింట్లు పెరిగితే, నిఫ్టీ 137 పాయింట్లు వృద్ధి చెందినది తెలిసిందే. బిఎస్‌ఇ మార్కెట్ విలువ కూడా 111 లక్షల కోట్లకు చేరువైంది.