బిజినెస్

జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో హోల్డింగ్స్ పునర్‌వ్యవస్థీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బహుళ వ్యాపార గ్రూపైన జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో హోల్డింగ్స్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో ప్రతిపాదిత హోల్డింగ్స్ పునర్‌వ్యవస్థీకరణ కోసం ఒప్పందాలు జరిగినట్లు శుక్రవారం జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. ఈ ఒప్పందాల ప్రకారం 2017 జూన్ 5కు ముందు జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో ప్రైవేట్ ఈక్విటీ ఇనె్వస్టర్లకున్న ఈక్విటీ సెక్యూరిటీలను కొనుగోలు చేసే అధికారం జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాకు ఉంటుంది.

చోళమండలం ఎమ్‌ఎస్‌లో 40 శాతానికి మిట్సుయ్ వాటా

చెన్నై, డిసెంబర్ 25: చోళమండలం ఎమ్‌ఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయానికి మురుగప్ప గ్రూప్ సంస్థ అయిన ట్యూబ్ ఇనె్వస్ట్‌మెంట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంగీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ట్యూబ్ ఇనె్వస్ట్‌మెంట్స్ శుక్రవారం తెలిపింది. చోళమండలం ఎమ్‌ఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 14 శాతం వాటాను 883 కోట్ల రూపాయలకు ట్యూబ్ ఇనె్వస్ట్‌మెంట్స్ అమ్ముతుండగా, దీన్ని జపాన్ సంస్థ మిట్సుయ్ సుమిటొమో ఇన్సూరెన్స్ సంస్థ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం చోళమండలం ఎమ్‌ఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మిట్సుయ్ సుమిటొమో ఇన్సూరెన్స్‌కు 26 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలుతో 40 శాతానికి చేరనుంది. వాటా పెంపును ట్యూబ్ ఇనె్వస్ట్‌మెంట్స్ చైర్మన్ మురుగప్పన్ స్వాగతించారు.